సినిమాలు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. అవకాశం రావాలే కానీ ఎవరైనా నటించాలని అనుకుంటారు. అందులోనూ ప్రధానంగా హీరోయిన్ అయ్యాక.. ఈ గ్లామర్ ప్రపంచంలో అడుగు పెట్టాక ఈ మాయా ప్రపంచాన్ని వదిలి ఎవరూ బయటకు వెళ్లరు. అయితే చిత్ర పరిశ్రమ నుంచి కొందరు హీరోయిన్లు మాత్రం ఎంతో ప్రత్యేకం.. ఎందుకు అంటే సినిమా ప్రపంచం ఎలాంటిదో ఒక్క సినిమాతోనే వారు తెలుసుకుని ఆ సినిమా తర్వాత నుంచి వారు ఈ మాయా ప్రపంచంలో కనిపించలేదు. ఇక అలా కనిపించని హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అలాంటి హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
గిరిజ:
‘గీతాంజలి’ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గిరిజ సినిమా తర్వాత మలయాళం, బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చినా తాను ఈ సినిమా ప్రపంచం నుంచి తప్పుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఆమె తిరిగి స్వదేశానికి రాలేదు.
ఎస్పీ శైలజ:
ప్రముఖ గాన గంధరుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం సోదరి ఎస్పీ శైలజ కూడా చిత్ర పరిశ్రమకు పరిచయమైన శైలజ ఎంతో గొప్ప సింగర్ మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ కూడా.. అందుకే ఆమెను సినిమాలో నటింపచేయాలని కళాతపస్వి విశ్వనాధ్ గారు పట్టుపట్టి మరి సాగర సంగమం సినిమాలో ఆమెను నటింపచేసారు. కానీ ఆమె ఆ సినిమా తర్వాత పరిశ్రమ అంటే భయపడి కేవలం సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే పరిమితమయ్యారు.
గాయత్రి జోషి:
బాలీవుడ్ లో బాద్‌షా షారుక్ ఖాన్ తో నటించిన హీరోయిన్‌లకు ఎంత డిమాండ్ ఉంటుందో మన అందరికి తెలుసు. అంత క్రేజ్ ఉన్న షారుక్ సరసన స్వదేశ్ సినిమాలో నటించిన గాయత్రి ఆ ఒక్క సినిమాతోనే నటనకు స్వస్థి చెప్పి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది.
భమిడిపాటి సబిత:
విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన గోప్ప సినిమాలో సప్తపది కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భమిడిపాటి సబిత మంచి క్లాసికల్ డ్యాన్సర్. ఆ సినిమా తర్వాత ఎందుకో ఆమె సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్టాడుతు తనకు వచ్చిన అవకాశాల గురించి కూడా చెప్పింది.
మహానది శోభన:
కమల్ హసన్ హీరోగా వచ్చిన కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా మహనది. ఈ సినిమాలో కమల్ కూతురుగా నటించిన శోభన అనే అమ్మాయి. ఈ సినిమా తర్వాత ఈమె మళ్ళీ ఎక్కడ కనిపించలేదు.. పైగా ఆమె ఒక ప్రొఫెషనల్ సింగర్ అవడంతో ఆ సినిమాలో ఆమె ఒక అద్భుతమైన పాట కూడా పడింది. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుంది. ఇలా సినిమా పరిశ్రమ నుంచి మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ వదిలేసిన హీరోయిన్స్ వీరే