యష్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు KGF. కన్నడ సినిమాను దేశవ్యాప్తంగా పరిచేయం చేసిన సినిమా పేరు KGF. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యష్ హీరోగా రూపొందిన KGF సినిమా ఒక్క కన్నడ ప్రేక్షకులనే కాకుండా యావత్ భారత సినిమా ప్రక్షకులందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక ఆ సినిమాతో యష్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తరువాత వచ్చిన KGF 2 సినిమా కూడా బస్టర్ హిట్ అవ్వడంతో యష్ క్రేజ్ దిగంతాలకు చేరింది.
అంతవరకూ ఓకే గాని, KGF ప్రాజెక్ట్స్ తరువాత యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అన్న విషయంపైన ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ రాకపోవడం అనేది ఇపుడు యష్ అభిమానులను వెంటాడుతోన్న పెద్ద ప్రశ్న. KGF సినిమా రిలీజై 6 నెలలు కావస్తోంది. యష్ ఏ డైరెక్టర్ తో పని చేయబోతున్నాడు? హీరోయిన్ ఎవరు? ఎలాంటి సినిమా? అన్న అంశాలపైన అయితే కన్నడిగులు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. అయినా ఎలాంటి సమాచారం అందకపోవడంతో హీరో యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
మరోవైపు కన్నడలో KGF 3 సినిమా గుసగుసలు జోరుగా వినబడుతున్నాయి. ఈ తరుణంలో అదే సినిమా చేయబోతున్నాడా లేదంటే వేరే ప్రాజెక్ట్ చేయబోతున్నాడా? అనేదే ఇపుడు జవాబు లేని ప్రశ్న. కాగా యష్ తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ… ఒక బ్లాక్ బాస్టర్ హిట్ పడిన తర్వాత ఏది పడితే అది చేయలేము కదా. ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవరించాల్సిన విషయం. అందుకే నా తదుపరి సినిమా కోసం అభిమానులు కాస్త వెయిట్ చేయాల్సిన అవసరం వుంది. నేను కూడా ఆలోచించాలి కదా అని చెప్పుకొచ్చాడు. దాంతో యష్ అభిమానులు ఓ అభిప్రాయానికొచ్చినట్టు భోగట్టా.