అక్కినేని మ‌న‌వ‌రాలు సుప్రియ‌తోనే అడ‌వి శేష్ డేటింగ్‌.. ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా…!

టాలీవుడ్ లో ఉన్న యువ హీరోలలో ప్రస్తుతం అడివి శేష్ సూపర్ సక్సెస్ ల‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఆరు విజయాలను తన ఖాతాలో వేసుకున్న శేష్.. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరిని కూడా చెప్పొచ్చు. రీసెంట్ గానే తన 38వ పుట్టినరోజు జరుపుకున్న శేష్.. ఇంత ఏజ్ బార్ అవుతున్న ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తలేదు. ఏదైనా పలు ఇంటర్వ్యూలలో పెళ్లి మాట వస్తే మాత్రం సమాధానాన్ని దాటవేస్తూ వస్తున్నాడు.

Adivi Sesh: Major is a film far removed from usual cinema- Cinema express

అయితే అతని సన్నిహితులు మాత్రం శేష్ సింగిల్ కాదు టాలీవుడ్ లో ఉన్న ఓ లేడీ ప్రొడ్యూసర్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ లేడీ ప్రొడ్యూసర్ ఎవరన్నది బహిరంగంగా ఎవరు చెప్పలేదు. తాజాగా ఇప్పుడు శేష్ ఆ విషయంపై తానే ఓపెన్ అయిపోయాడా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఈ చర్చ ఇంతలా జరగడానికి ముఖ్య కారణం అక్కినేని కుటుంబ క్రిస్మస్ సెలబ్రేషన్ కు సంబంధించిన పిక్‌ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Adivi Sesh's pan india aspirations

ఆ ఫోటోలో అక్కినేని కుటుంబానికి సంబంధించిన సభ్యులందరూ ఉన్నారు.సుమంత్, సుశాంత్, అఖిల్, సుప్రియ.. ఇలా పలువురు అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్న ఫోటోలో ఒకే ఒక బయట వ్యక్తి అడివి శేష్.
ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక అతను సుప్రియ పక్కన ఉండటంతో మరింత రచ్చకు దారితీసింది. శేష్ డేటింగ్ లో ఉన్నది సుప్రియ తోనే అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరిద్దరికి అడవి శేష్‌ హీరోగా వచ్చిన గూఢ‌చారి సినిమా ద్వారా వీరి బంధం ఏర్పడినట్టు తెలుస్తుంది.
సుప్రియ ఆ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా కూడా వ్య‌వ‌హ‌రించింది. ఇక అంతే కాకుండా ఆ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కూడా నటించి మెప్పించింది. ఆ సినిమా దగ్గర నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయమే కాస్త ఇప్పుడు ప్రేమకు దారి తీసినట్లుగా ఆ ఫోటో చూస్తుంటే అర్థమవుతుందని అందరూ అంటున్నారు.

ఇన్ని రోజులు శేష్ ఎవరితో డేటింగ్ లో ఉన్నాడనే విషయంపై ఎవరు ఓపెన్ గా మాట్లాడలేదు కానీ తాజాగా వచ్చిన పిక్ తో శేష్ సుప్రియ‌తో డేటింగ్ లో ఉన్నట్టు ఓపెన్ అయిపోయినట్లుగా చెప్పవచ్చని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.