యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నాడు. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ సినిమా తర్వాత కాస్త ఫ్రీ టైమ్ దొరకడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో తన క్వాలిటీ టైమ్ గడుపుతున్నాడు. కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా చాలా టైం ఉంది. అందుకే ఇప్పుడు వెకేషన్ల ప్లాన్లో ఉన్నాడు. అందులో భాగంగా తన కుటుంబంతో సుధీర్ఘ అమెరికా పర్యటనకు వెళ్లాడు. తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు.
ఎన్టీఆర్ ఆ పోస్ట్ లో అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఉన్న ప్రముఖ భారతీయ జునూన్ అనే రెస్టారెంట్ గురించి తన పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. ”అమెరికా పర్యటనలు చేసే వారికి ఈ రెస్టారెంట్ బెస్ట్ అని , జునూన్ NYC లో అమేజింగ్ అని అన్నారు”. ఆ రెస్టారెంట్లో ఉన్న సిబ్బందితో ఎన్టీఆర్ ఫోటో దిగగా ఆ ఫోటోలో ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే భారీ మీసాలు మరియు గడ్డంతో స్టైలిష్ గా కనిపించాడు.
ఎన్టీఆర్ అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే కొరటాల దర్శకత్వంలో తన 30వ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమా కోసమే ఎన్టీఆర్ ఈ లుక్ లో కనిపించాడని కామెంట్లు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాడని కూడా తెలుస్తుంది.