వీరసింహారెడ్డి ప్ర‌మోష‌న్ల‌లో ఎప్పుడూ క‌నిపించ‌ని రోల్లో న‌ట‌సింహం బాల‌య్య‌…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత నటిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. క్రాక్ లాంటి సూపర్ హిట్ తో ఫుల్ క్రేజ్ లో ఉన్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Veera Simha Reddy Motion Poster | Nandamuri Balakrishna | Shruti Haasan |  Gopichandh Malineni - YouTube

తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా నిన్నటితో కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ టైమ్‌ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లు కూడా చాలా జోరుగా చేస్తున్నాయి. ఈ సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ చేయగా.. వాటికి అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే ఈ సినిమా ప్రమోషన్లో బాలకృష్ణ కూడా జాయిన్ అవ్వబోతున్నార‌ట‌.

Veera Simha Reddy Release Date, Star Cast, Trailer, Plot & More - JanBharat  Times

జనవరి ఫస్ట్ వీక్ నుంచి జరిగే ఈ సినిమా ప్రమోషన్లలో బాలకృష్ణ కూడా స్పెషల్ అట్రాక్షన్ ఇవ్వబోతున్నాడట. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోల్‌లో భారీ స్థాయిలో ప్లాన్ చేయబోతున్నారు. వీటితో పాటు పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్స్ లో కూడా బాలకృష్ణ జాయిన్ అవ్వబోతున్నాడు.

The First Single 'Jai Balayya' From Balakrishna's 'Veera Simha Reddy' Will  Be Out On This Date

ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా అందాల భామ శృతిహాసన్ నటించింది. ఈ సినిమాకు బాలకృష్ణ అఖండ సినిమాకు మ్యూజిక్ అందించిన థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.