ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు ఎక్కువై పోయాయి. అయితే వారిలో కొంతమంది ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవించడానికి వారి పెద్దలను ఒప్పించి ఆ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటున్నారు. మరికొంతమందేమో ఆ ప్రేమ బంధాన్ని మధ్యలోనే వదిలేసుకుంటున్నారు. ఎన్నో కారణాల వల్ల తమ ప్రేమ బంధాన్ని మధ్యలోనే వదిలేసుకున్నారు. ఇలా హీరోయిన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
• సమంత
టాలీవుడ్ బ్యూటీ సామ్ హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. కానీ కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఏ మాయ చేసావే సినిమాలో తనతో కలిసి నటించిన నాగచైతన్య ని ప్రేమించి వివాహం చేసుకుంది. నాలుగు సంవత్సరాల వివాహ బంధానికి గత ఏడాది విడాకులతో వీడ్కోలు చెప్పింది.
• రష్మిక
పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ రష్మిక తన కెరీర్ కోసం పెళ్లిని క్యాన్సల్ చేసుకుంది.
• మెహ్రీన్
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. భవ్య బిస్నోయ్ అనే రాజకీయ నాయకుడితో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు.
• నయనతార
నయనతార మొదట శింబుతో ప్రేమలో పడి కొన్ని రోజులకే బ్రేకప్ చేసేసింది. ఇక ఆ తరువాత కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. ఆ ప్రేమ పెళ్లి వరకూ వెళ్లకముందే అది క్యాన్సిల్ అయింది. ఇక ఆ తరువాత తమిళ్ డైరెక్టర్ అయిన విగ్నేష్ శివన్ ని ప్రేమించి ఇటీవలే వివాహం చేసుకుంది. అంతేకాకుండా సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయింది. అలా చివరికి ఈమె పెళ్లి చేసుకోగలిగింది.
• త్రిష
టాలీవుడ్ హీరోయిన్ త్రిష తన మొదటి సినిమా హీరో అయిన శింబు తో ప్రేమలో పడింది. కొన్ని రోజులకి విరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం తో విడిపోయారు. ఆ తరువాత త్రిష ఒక తమిళ్ డైరెక్టర్ ని ప్రేమిచి ఎంగేజ్మెంట్ చేసుకుంది, కానీ అది పెళ్లి పెట్టాలవరకు రాకుండానే మధ్యలోనే ఆగిపోయింది.
• శృతి హాసన్
హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయణం నడిపిన శృతి కొద్ది రోజుల తరువాత అతనికి బ్రేకప్ చెప్పింది. ఆపై ఇంకొక వ్యక్తిని ప్రేమించింది, కానీ అది కూడా నిలబడలేదు. ఇక ఇప్పుడు శాంతను హాజారికాతో కలిసి ఉంటుంది. ఈ రిలేషన్‌షిప్ నిలుపుకుంటుందో లేదో చూడాలి.