బిడ్డను కన్నాక అలియా కొత్త యోగాలు.. బాడీని తలకిందులుగా పైకి లేపి…!!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు. 2022వ సంవత్సరం అలియా భట్‌కి ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించింది. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సీత పాత్రలో నటించిన అలియా పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ని పెళ్లి చేసుకొని హాయిగా సెటిల్ అయింది. పెళ్లి తరువాత వెంటనే ప్రెగ్నెంట్ అయింది. 6 నెలలలోనే అలియా పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది మరోసారి వార్తల్లోకెక్కింది.

ఇలా ఒక్క ఏడాదిలోనే ‘ఆర్ఆర్ఆర్ ‘మూవీలో కనిపించి, ఆ తరువాత వివాహం చేసుకొని, బ్రహ్మస్త్ర ప్రమోషన్స్‌లో పాల్గొని 6 నెలలోనే ఒక బిడ్డకి జన్మనిచ్చి ఎన్నో జ్ఞాపకాలు రుచి చూసింది. అలియా బిడ్డకు జన్మనిచ్చిన నెలన్నర సమయం అవుతుంది. కాగా ఇప్పుడు ఈ అందాల తార ఎప్పటికీ అందంగా కనిపించేందుకు తన బరువు గురించి శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది. ప్రెగ్నెన్సీ తరువాత వెయిట్ పెరిగిన అలియా ఎక్కువ వర్కౌట్స్‌ చేయడానికి ఇష్టపడటం లేదు. అందుకే దానికి ప్రత్యామ్నాయంగా యోగాని ఆశ్రయించి సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ అన్షుక చూపినట్లు యోగాసనాలు వేస్తోంది.

బిడ్డకు జన్మనిచ్చి నెల్లన్నర అవుతుందని.. అందుకే తన బాడీ పై దృష్టి పెట్టాను అని చెప్తుందీ క్యూట్ బ్యూటీ. “నేను డెలివరీ అయ్యాక వాకింగ్, ప్రాణాయామం చేశాను. కానీ ఇప్పుడు కష్టమైన ఆసనాలు వేస్తున్నాను. అందరి బాడీ ఒకేలా ఉండదు కాబట్టి డాక్టర్ ని సంప్రదించి ఆసనాలు వేయండి” అని అలియా సలహా ఇచ్చింది. అలానే ఒక పోస్ట్ షేర్ చేసింది. యోగాలో తలక్రిందులుగా వేలాడుతూ ఉన్న ఆసనం అలియా వేయగా.. దానికి సంబంధించిన వీడియోను ఫిట్‌నెస్ ట్రైనర్ అన్షుక తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఫిట్నెస్ పై అలియాకి బాగా శ్రద్ధ ఉందని పొగుడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by ANSHUKA YOGA (@anshukayoga)