పట్టలేని ఆనందంలో కాజల్..ఎగిరి గంతేసే న్యూస్ ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే తల్లి అయినప్పుడు ఉండే ఆనందం ప్రపంచంలో ఎలాంటి పనిచేసిన దక్కదు. అలాంటి ఓ హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ . లక్ష్మి కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత హిట్లు ఫ్లాప్ అని తేడా లేకుండా వరుస సినిమాలకు కమిటీ అయ్యి..టాలీవుడ్ , కోలీవుడ్ , బాలీవుడ్ ను ఏలేసింది .

కాగా కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్చులును ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ ..అంతే త్వరగా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసి నీల్ కిచ్చులు కి జన్మనిచ్చింది. కాగా ఏ హీరోయిన్ కూడా ఇంత త్వరగా ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసుకోలేదు . అంతేకాదు కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ఇంత త్వరగా ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకుని బిడ్డను కన్నడం ఇండస్ట్రీలో ఉండే ఫాన్స్ కు షాకింగ్ అనిపించింది .

కాగా ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్న కాజల్ ..రీసెంట్గా తన బాబుతో ఆడుతున్న కొన్ని ఫొటోస్ ను ..తన బాబుతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంది . ఈ ఫొటోస్ చూసిన కాజల్ ఫ్యాన్స్ చాలా ఆనంద పడుతున్నారు . నిజమైన హీరోయిన్ అంటే నువ్వే .. తల్లిని మించిన హీరోయిన్ ఎవరు ఉండరు.. నీ కళ్ళల్లో ఆనందమే చెప్తుంది నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో. ఇలాగే ఉండు కాజాలు “అంటూ చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు కొన్ని రోజులుగా సెకండ్ టైం గర్భవతి అయ్యింది అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆమె ఇక సినిమాలు చేయదేమో అని భయపడ్డారు . అయితే రీసెంట్ పోస్ట్ తో అది ఫేక్ అని తేలిపోయింది. దీంతో కాజల్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.