నందమూరి ఫ్యాన్స్‌కు క‌నివినీ ఎరుగ‌ని బిగ్ స‌ర్‌ఫ్రైజ్‌… ఇది క‌దా మ‌న‌కు కావాల్సింది…!

నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వ‌స్తున వీరసింహా రెడ్డి సినిమాలో షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నా బాలకృష్ణ ఈ సినిమా తో పాటు అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. త‌న కెరియర్ లో మొట్ట మొదటి సారి ఓ టాక్ షో కు హోస్ట్ గా చేయ‌డం…. తన వాక్ చాతుర్యంతో , తన డైలాగ్ డెలివరీతో అన్ స్టాపబుల్‌ను హిట్ చేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది.

aha's talk show "Unstoppable with NBK" breaks new records - Telugu News -  IndiaGlitz.com

ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2 రీసెట్ంగా ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ సీజన్ 2 కి కూడా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా ఈ టాక్ షో కు రెబల్ స్టార్ ప్ర‌భాస్ మరియు మ్యాచో హీరో గోపీచంద్ ముఖ్య అతిథులుగా వ‌స్తున్నారు. ఆ ఎపిసోడ్ కూడా న్యూఇయ‌ర్ కానుక‌గా డిసెంబ‌ర్ 31న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ టాక్ షోపై ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దద్దరిల్లిన ప్రోమో |Unstoppable With NBK Season 2 | Jr NTR | Kalyan Ram |  Latest Promo||TFID MEDIA| - YouTube

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కూడా ఒక ఎపిసోడ్ కు గెస్ట్ లుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కనుక ఈ ఎపిసోడ్ కు వచ్చినట్లు అయితే అది నంద‌మూరి అభిమ‌నుల‌కు పండుగా లాగా ఉంటుంది. ఒకే వెదిక‌పై ముగ్గురు నందమూరి హీరోలు కనబడినట్టు ఉంటుంది. ఈ ఎపిసోడ్ కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో అత్రుత‌గా ఎదురు చుస్తుంది.