2022 లో వివాదాస్పందంగా విడుదలైన చిత్రాలు ఇవే..!!

గడచిన కొద్ది రోజుల తర్వాత ఈ ఏడాది ముగియనుంది. ఇక తర్వాత కొత్త ఏడాది 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది కొందరికి మంచి సంవత్సరంగా నిలిస్తే మరి కొంతమందికి బ్యాడ్ ఇయర్ గా నిలిచింది. 2022లో కొన్ని చిత్రాలు మంచి విజయాన్ని అందుకోగా మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. ఎన్నో చిత్రాలు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద చేతికిల పడ్డాయి. అయితే కొన్ని సినిమాలు విడుదలకు ముందే పలు వివాదాలు చుట్టుముత్తాయి అలాంటి సినిమాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1). బ్రహ్మాస్త్ర:
బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ ,ఆలియా భట్, అమితాబచ్చన్, నాగార్జున ,మౌని రాయ్ ,షారుక్ ఖాన్ తదితరులు నటించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటినుంచి ప్రేక్షకులు హర్ట్ అయ్యారు.ఈ సినిమా ట్రైలర్ నుంచి నిరసనసగా మొదలైంది బహిష్కరించాలని మరికొంతమంది డిమాండ్ చేశారు.

2). కాశ్మీర్ ఫైల్:
ఈ చిత్రాన్ని వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వహించారు ఈ సినిమా కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీర్ హిందువుల వలసలను వర్ణించడం జరిగింది. ఇందులో అనుపమ కేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, అగ్నిహోత్రి తదితరులు నటించారు. ఈ చిత్రం విడుదల ఇప్పటికే కూడా వివాదం గానే నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ముస్లింలను అభ్యంతర సన్నివేశాలను చూపించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెలువతాయి

3). లాల్ సింగ్ చద్దా:
అమీర్ ఖాన్ కరీనాకపూర్ నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలకమైన పాత్రలు నటించారు. ఈ చిత్రం కూడా విడుదలకముందే భాయ్ కాట్ కు గురయింది. అమీర్ ఖాన్ భారత సైన్యాన్ని అగౌరపరిచారని ఈ సినిమా మీద పలు విమర్శలు ఎదురయ్యాయి.

4). కాళి:
నిర్మాత లీనా మనిమేకలై తన డాక్యుమెంటరీ ఖాళీ పోస్టర్ని షేర్ చేసింది. దీంతో ఈ సినిమా భారీ వివాదానికి దారితీసింది. కాళీమాత సిగరెట్ తాగుతున్నటువంటి ఫోటోని షేర్ చేయగా ఈ పోస్టర్ చూసిన జనం ఆగ్రహానికి గురయ్యారు.

ఇదే కాకుండా మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి.