టైం చూసి కొట్టిన సమంత.. గూబ గుయ్యమనిందా బాబు..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ఫస్ట్ టైం చేసిన పాన్ ఇండియా ఫిలిం “యశోద”. ఏ హీరో లేకుండా లేడీ ఓరియెంటెడ్ గా సినిమాలో నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను మెప్పించింది . అంతేకాదు తెలుగు సినిమాల్లో హీరో లేకపోతే చూడలేరు అన్న భ్రమను పోగొట్టేసింది. సమంత నటించిన యశోద సినిమా ఎలాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. స్టార్స్ సైతం సమంత నటనకు మెచ్చి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తమ రివ్యూ ని ఇచ్చారు.

కాగా సమంత ఒకవేళ నాగచైతన్యతో కలిసి ఉంటే ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నాగార్జున అందరికి పెద్ద పార్టీ ఇచ్చుండేవారు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ టైం లోనే మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది సమంత. అయితే సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి ఆమె కోల్కోవాలని పూజలు చేసి ట్వీట్లు చేసిన అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఏమాత్రం స్పందించలేదు .

అక్కినేని అఖిల్ తప్పిస్తే అక్కినేని ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు అఫీషియల్ గా ఎవరు ఆమె జబ్బు గురించి మాట్లాడలేదు . కాగా ఇదే టైంలో అక్కినేని ఫ్యామిలీ పై ఎక్కువగా ట్రోల్స్, సినీ ఫీల్డ్ లో సైతం అక్కినేని ఫ్యామిలీని చులకనగా చూస్తుండడంతో.. అక్కినేని నాగ చైతన్య.. సమంతకు పర్సనల్గా కాల్ చేశాడన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అంతేకాదు దక్షిణ కొరియాలో మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత అతను కాల్ చేసిన సరే లిఫ్ట్ చేయలేదట . ఈ క్రమంలోనే సమంత అబ్బాయికి గూబ గుయ్యమనే ఆన్సర్ ఆన్సర్ ఇచ్చింది అంటూ సమంత ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే విడాకులు తీసుకొని సంవత్సరం దాటిన ఇప్పటికీ వీళ్ళ గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది అంటే వీళ్ళ జంట జనాల మదిలో ఎలా పాతుకు పోయిందో అర్థం చేసుకోవచ్చు..!!