అన్ స్టాపబుల్-2 ప్రభాస్ ప్రోమో అదిరిపోయిందిగా.. డార్లింగ్ నిజంగా అన్ స్టాపబుల్..!

అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాలయ్య షో సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ నుంచి ఎట్టకేలకు ప్రోమోను విడుదల చేశారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అతని ప్రాణ స్నేహితుడు గోపీచంద్ తో కలిసి హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభాస్ ను బాలయ్యతో కలిసి గోపీచంద్ ఒక ఆట ఆడుకున్నారని చెప్పాలి. అంతే కాదు చాలా కాలం తర్వాత బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో ఎంత సరదాగా నవ్వుతూ కనిపించారో.. ఇప్పుడు ఈ వేదికపై ఇంతే సంతోషంగా కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

ఈ వేదికపై ఎన్నో విషయాలను పంచుకోబోతున్నారు. ఇటీవల విడుదలైన ప్రోమోలో ప్రభాస్ గోపీచంద్ తో బాలయ్య అల్లరి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ముఖ్యంగా ప్రభాస్ ను ఒక రేంజ్ లో వీరు టీస్ చేశారు. ప్రభాస్ కు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా బయట పెట్టేందుకు గోపీచంద్ ప్రయత్నిస్తుండగా ప్రభాస్ ఆపడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఒక సీక్రెట్ రివీల్ చేసేందుకు గోపీచంద్ ప్రయత్నం చేయగా.. ఒరేయ్ అంటూ ఆపే ప్రయత్నం చేశారు ప్రభాస్.. ఆ తర్వాత గోపీచంద్ మీదకు ఏదో విసరడానికి ప్రయత్నిస్తుండగా బాలయ్య గోపీచంద్ కు అడ్డుగా నిలబడ్డాడు.

ఇలా ఈ ముగ్గురు కలిసి స్టేజ్ పై అల్లరి చేసి నవ్వులు పువ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారగా ప్రభాస్ అభిమానుల ఆనందాలకు కళ్లెం వేయడం అసాధ్యమని తెలుస్తోంది. ఇప్పుడు రాబోయే శుక్రవారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.