నేను ఆ టైప్ కాదు..తాప్సీ గుచ్చాల్సిన వాళ్లకి రాడ్ దింపేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోయిన్స్ చాలా తక్కువ. అలా మాట్లాడితే ఎక్కడ స్టార్స్ హర్ట్ అవుతారో అని.. హర్ట్ అయితే అవకాశాలు రాకుండా పోతాయి అని బెదిరిపోయి చెప్పాలనుకున్న మాటలను చెప్పకుండా ..లో లోపల దాచి పెట్టేసుకుంటారు . అలాంటి హీరోయిన్స్ ఏ ఎక్కువ మన ఇండస్ట్రీలో ఉన్నారు. కాగా ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా మాట్లాడే హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉన్నారు . అలాంటి వారిలో ఒకరే ఈ తాప్సి పన్ను.

బోల్డ్ రోల్స్ చేయడమే కాదు ..చాలా బోల్డ్ గా కూడా మాట్లాడగలదు . ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ సినిమాతోనే రాఘవేంద్రరావు లాంటి స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో నటించడం చాలా గ్రేట్ అంటూ కాంప్లిమెంట్స్ అందుకున్నింది. అంతేకాదు రాఘవేంద్రరావు సైతం తాప్సి నటనకు ఫిదా అయినట్లు ఆ సినిమా చేస్తున్న టైంలో వార్తలు వినిపించాయి.

కాగా ఝుమ్మంది నాదం సినిమా పాజిటివ్ హిట్ అవ్వడంతో తాప్సీ పలు రకాల రోల్స్ లో నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకునింది. అంతేకాదు తద్వారా బాలీవుడ్ లో అవకాశాలు అందుకొని బాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా మారిపోయింది . కాగా బాలీవుడ్ లో కూడా కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యే తాప్సి రీసెంట్గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .

ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నిజజీవితంలో నాకు కొంతమంది నటులగా నటీమణులాగా నటించడం రాదు. కెమెరా ముందు ఉంటేనే నటించగలను లేకపోతే నటించడం అస్సలు రాదు ..అలా నటించి నేను బ్రతకలేను “అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చింది. దీన్ని బట్టి ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఏ రేంజ్ లో తెర వెనక కూడా నటిస్తున్నారో.. అలా అవకాశాలు అందుకున్నారో చెప్పకనే చెప్పేసి ఘాటుగా అలాంటి వాళ్లకి గుణపం దింపేసింది తాప్సి అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు తాప్సి కామెంట్స్ ఇండస్ట్రీలో ఉండే ఓ సో కాల్డ్ హీరోయిన్ కి బాగా వర్తిస్తాయి అంటూ జనాలు అందరూ ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే తాప్సికి తెలివితేటలు ఎక్కువ అని జనాలు అంటున్న మాట వాస్తవమని మరోసారి ప్రూవ్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ..!!