చిరంజీవి అంజి చిత్రం ఫ్లాప్ కావడానికి కారణం అదేనా..?

చిరంజీవి కెరియర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు విడుదలయ్యాయి. అయితే కొన్ని చిత్రాలు ఫ్లాప్ గా మిగిలిన మరికొన్ని చిత్రాలు చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పాయని చెప్పవచ్చు. అయితే చిరంజీవి కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో అంజి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం అప్పట్లో అత్యధిక గ్రాఫిక్స్ విజువల్ వండర్ గా పలు రికార్డులను సృష్టించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2004లో విడుదలైంది.

Anjiఇక ఆ సమయంలోనే ప్రభాస్ నటించిన వర్షం, బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ అంటే చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. అంజి చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో శ్యాం ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారు. అయితే ఈ సినిమా ఎలా తెరకెక్కింది.. ఈ చిత్రం నిర్మాణానికి ముందు ఏం జరిగిందనే విషయం దివంగత కోటి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు సమాచారం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Anji Songs With Lyrics - Chik Buk Pori Song - YouTubeచిరంజీవి, బి.గోపాలతో చేసిన ఇంద్ర వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఠాగూర్ వంటి చిత్రలు రెండు భారీ విజయాలను అందుకున్నాయి. అయితే ఆ సమయంలోనే ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి చిరంజీవితో ఒక భారీ గ్రాఫిక్స్ మూవీని చేద్దామని చిరంజీవి డేట్లు తీసుకున్నారట. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యత కోడి రామకృష్ణ కి అప్పగించారట శ్యాం ప్రసాద్ రెడ్డి. అయితే ఇలాంటి గ్రాఫిక్స్ సినిమా కంటే ఏదైనా కమర్షియల్ సినిమా చేద్దామని కోడి రామకృష్ణ శ్యాం ప్రసాద్ రెడ్డికి చెప్పగా పట్టు పార్టీ మరి గ్రాఫిక్ చిత్రాన్ని చేయించారట. దీంతో చిరంజీవి కూడా కమర్షియల్ సినిమాకి ఒప్పుకోకపోవడంతో ఈ చిత్రానికి ఎక్కువ మక్కువ చూపడంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కోసం చిరంజీవి ఉతకకుండా ఉండే ఒక షర్టును రెండేళ్లపాటు వేసుకోవలసి వచ్చిందని తెలియజేశారు. ఇక చిరంజీవి ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా తనకి సంతృప్తి ఇచ్చిన సినిమా ఇదే అని అటు చిరంజీవి కోడి రామకృష్ణ ఎన్నో సార్లు తెలిపినట్లు తెలిపారు.