ట్రైలర్:సరికొత్త కథ అంశంతో వస్తున్న 18 పేజీస్..!!

హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా వస్తున్న 18 పేజీస్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. సుకుమార్ వైటీంగ్స్ బ్యానర్ పైనే బన్నీ వాసు విచిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. డిసెంబర్ 23వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ పనులను వేగవంతం చేశారు చిత్ర బృందం.

నిన్నటి రోజున ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ఫేస్బుక్లో అకౌంట్ లేని ఓ అమ్మాయి డైరీ ఫాలో అవుతూ తన ప్రేమలో పడే ఒక యువకుడి కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది. పిరియాడిక్ సినిమాల యొక్క ఈ చిత్రం కూడా 1990 లో జరిగే ఒక కథ అంశం చుట్టూ తిరుగుతున్నట్లుగా ఒక అందమైన ప్రేమ కథ సినిమాల ఉన్నట్లు ఈ డైలాగులను బట్టి తెలుస్తోంది. డైరీ హీరో చేతిలోకి ఎలా వచ్చింది ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడుంది? ఇంతకీ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ అమ్మాయిని హీరో కలవనున్నాడా అనే విషయం తెలియాలి అంటే డిసెంబర్ 23 వరకు ఆగాల్సిందే.

ఈ చిత్రంలోని విజువల్స్ హీరో హీరోయిన్స్ ల నేపథ్యంలో అత్యంత ఆసక్తికరంగా రేకెత్తిస్తోంది. ప్రేమకథలు సరికొత్తగా ఈ సినిమా ఉంటుందని ఫీలింగ్ ఈ ట్రైలర్ లో చూపించారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.