ప్లాస్టిక్ సర్జరీ ల వల్ల ట్రోల్స్ కు గురవుతున్న హీరోయిన్స్..!!

నటీనటులు సైతం ఎంతోమంది అందంగా కనిపించడానికి పలు రకాల పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది సర్జరీ చేయించుకుని అందంగా కనిపిస్తూ ఉంటే మరి కొంతమంది మేకప్పులతోనే అందంగా కనిపిస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఇందులో కొంతమంది హీరోయిన్లవి సక్సెస్ అయ్యాయి మరి కొంతమంది సర్జరీలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం

హీరోయిన్ దిశాపటాని తన అందంతో కుర్ర కాలాలను బాగా ఆకర్షిస్తుంది. మంచి ఫిట్నెస్ తో కూడా కలదు. ఈ ముద్దుగుమ్మ ఏక్ విలన్ రిటర్న్ ట్రైలర్ లాంచ్ లో పూర్తి భిన్నంగా కనిపించింది. ముక్కు అందంగా కనిపించడం కోసం వరుస సర్జరీలు చేయించుకోవడంతో నెటిజన్లు ఏమైనా ట్రోల్ చేస్తున్నారు.

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన నాగిని సీరియల్ లో ఫేమస్ అయిన మౌని రాయ్ అందరికీ సిపరిచితమే. ఈమె ఎన్నోసార్లు సర్జరీకి వెళ్ళింది తన ముఖాన్ని సర్జరీ చేయించుకున్న అందుకు పలుసార్లు విమర్శలు ఎదుర్కొంది.

మరొక హీరోయిన్ మాధురి దీక్షిత్. అందమంతా ఈమె ముఖంలోనే సొంతం అన్నట్టుగా బాగా పాపులర్ అయింది కానీ రకరకాల సర్జరీల కారణంగా ఈమె అందాన్ని పోగొట్టుకుందని విమర్శలు వెలుపడ్డాయి.

ఇక గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన ప్రియాంక చోప్రా ప్లాస్టిక్ చోప్రా గా పిలువబడుతొంది.ఇటీవల తన పుస్తకం అన్ ఫినిష్డ్ లాంచింగ్ సమయంలో ప్లాస్టిక్ చోప్రా అని పిలిచారు.

ఇక మరొక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గ్లామర్ పోటీలకు హాజరయ్యే క్రమంలో ప్లాస్టిక్ సర్జరీ ల గురించి పలు వార్తలు వినిపించాయి. ఈమె ముఖమంతా సర్జరీలే చేయించుకున్నట్లు వార్తలు వినిపించాయి.

అలాగే కమలహాసన్ కూతురు శృతిహాసన్ కూడా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది.ముఖ్యంగా తన ముక్కు పెదాలకు సర్జరీ చేయించుకుంది. తన ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆమె స్వయంగా తెలియజేసింది.

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కాస్మెటిక్ సర్జరీ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా లిప్ సర్జరీ తర్వాత ఇమే ముఖంలో పలుమార్పులు వచ్చాయి.. దీంతో ట్రోల్ అయింది.