ప్రపంచం మెచ్చిన తొలి తెలుగు దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి .. బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు ఖ్యాతిని పెంచిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారు. అంతేకాదు ఆస్కార్ పొందడమే లక్ష్యంగా వివిధ దేశాలలో కూడా సినిమాను రిలీజ్ చేస్తూ ఆస్కార్ బరిలో దిగడానికి పోటీ పడుతున్నాడు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో బిజీగా ఉన్నాడు అని.. త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి మహేష్ బాబుతో తన చిత్రాన్ని మొదలుపెడతాడు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే మహేష్ బాబుతో ఆఫ్రికా అడవుల్లో యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని రూపొందించబోతున్నాము అని తప్పకుండా మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర వర్మ కూడా తెలిపిన విషయం తెలిసిందే. దీంతో మహేష్ బాబు అభిమానులే కాదు యావత్ ప్రపంచమంతా రాజమౌళి తన తదుపరిచిత్రాన్ని ఏ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..? అతని టేకింగ్ ఎలా ఉండబోతోంది? అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు తర్వాత ఆయన మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.
బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ , ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ కలయికతో ఈ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే, ఆది పురుష్ , సలార్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. మరోపక్క ఎన్టీఆర్ మాత్రం తన సినిమాను ఇంకా సెట్ పైకి తీసుకెళ్లలేదు. ఎలాగైనా సరే తమ సినిమాలను పూర్తి చేసిన వెంటనే రాజమౌళి కూడా మహేష్ బాబుతో సినిమా పూర్తి చేసి తదుపరిచిత్రాన్ని వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
ఒకవేళ ఇదే కనుక జరిగితే ప్రభాస్ , ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పంచుకోబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ చక్కగా సెట్ అయింది.. మరి ఎన్టీఆర్, ప్రభాస్ కాంబినేషన్ ఏ విధంగా సెట్ అవుతుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాతో వీరిద్దరికీ మరొకసారి లైఫ్ స్పామ్ పెరిగినట్లుగా అని చెప్పాలి.