బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలో విల‌న్‌గా ఆ స్టార్ హీరో…!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవ‌గా.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల అవ్వకముందే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమ‌నుల అంచ‌న‌ల‌కు తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు.

Nandamuri Balakrishna Latest Stories at Filmify.in, Nandamuri Balakrishna  Updates, And Many More From Nandamuri Balakrishna - Filmify.in

 

ఈ సమయంలోనే బాలకృష్ణ తన తర్వాత సినిమాని వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి తో చేయబోతున్నాడు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి అవ‌గా త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడి సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాల‌కృష్ణ‌ 55 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పాత్రలోకి నటించబోతున్నాడు.

NBK108: NBK108 ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య అండ్ టీమ్!

ఇందులో బాలయ్యకు కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల‌ న‌టిస్తోంది. మరో క్రేజీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూడా ఒకీలక పాత్రలో నటించబోతున్నట్టు ఈ సినిమా యూనిట్ అధికారకంగా ప్రకటించింది. ఈ కోలీవుడ్ సీనియర్ హీరో తెలుగులో బాలయ్యతో కలిసి నటించబోయే మొదటి సినిమా ఇదే.

Versatile Actor Joins NBK108 Shoot | cinejosh.com

అయితే ఈ వార్త బయటకు రావడంతో బాలయ్య సినిమాలో శరత్ కుమార్ విలన్ అయితే అద్భుతంగా ఉంటుంది అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

NBK 108 Movie launch : NBK 108 మూవీ పూజ కార్యక్రమాలు.. - 10TV Telugu

ఈ సినిమాలో బాలయ్యకు జంట‌గా నటించబోయే హీరోయిన్ ఎవరు అనే విషయం ఇంకా క్లారిటీరాలేదు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో టాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ ప్రియమణిి నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ గురించి కూడా అధికార ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.