హీరోయిన్ ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం..!!

తెలుగు, తమిళ సినీ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలు అందుకున్న హీరోయిన్ ఖుష్బూ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళనాడులో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమెకు అక్కడ ఒక దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతటి స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషలలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. తెలుగులో ఈ ఏడాది శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో నటించింది.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇదే కాకుండా బుల్లితెరపై పలు షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండే ఖుష్బూ ఇప్పుడు శోకసముద్రంలో మునిగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఖుష్బూ సోదరుడు అబ్దుల్లా ఖాన్ గత కొంతకాలం నుంచి పలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈరోజు తుది శ్వాస విడిచినట్లు తమిళ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా చిన్నప్పటి నుంచి తన అన్నయ్య తో ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపిన ఖుష్బూ ఒక్కసారిగా శోకసముద్రంలోకి మునిగిపోయింది.

విషాదం.. ఖుష్బూ సుందర్ సొంత అన్న మృతి.. భావోద్వేగమైన పోస్ట్ చేసిన సీనియర్  నటి!

ఇక సోషల్ మీడియాలో కూడా ఎమోషనల్ అవుతూ ఒక పోస్టును షేర్ చేసింది ఖుష్బూ.ఖుష్బూ ఎప్పుడు కూడా తన అన్నయ్యలతో మంచి సన్నిహిత్యంగా ఉండేది. అబ్దుల్లా ఖాన్ తో పాటు ఆమెకు అబూ బాకర్ మరియు ఆలీ అనే మరొక ఇద్దరు సోదరులు ఉన్నట్లు తెలుస్తోంది. అబ్దుల్లా ఖాన్ కి ఆనారోగ్యం వచ్చినప్పుడు నుంచి ఖుష్బూ నే ఆయన దగ్గరుండి తన సొంత ఖర్చులతో చికిత్స చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాని చివరికి తనని కాపాడుకోలేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతోంది.