సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిలు, ఎఫైర్ లు, విడాకులు చాలా కామన్ . సినిమాలు చేస్తున్న టైంలో పద్ధతిగా ప్రేమించుకుని ..ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ..పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు కాపురం చేశాక విడిపోయిన జంటలు ఎంతోమంది ఉన్నారు . కేవలం హీరో హీరోయిన్స్ నే కాదు ..డైరెక్టర్స్ సైతం అలా మోజు తీరాక వదిలేసిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. కాగా ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ పెళ్ళి ఆయి ఏడాది తిరగకముందే దూరం పెట్టి..ఆ తరువాత విడాకులు ఇచ్చిన న్యూస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
బడా బడా హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ డైరెక్టర్ .. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు . ఈ డైరెక్టర్ పెళ్లయిన ఆరు నెలల నుండే భార్యను దూరం పెట్టడం స్టార్ట్ చేశారు . ఈ క్రమంలోనే చదువుకున్న భార్యకు డౌట్ వచ్చి ఆరా తీయగా ఆయన మరో హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడని ఆ కారణంగానే తనను దూరం పెడుతున్నారని అర్థం చేసుకుంది . అందరిలాగా విషయాన్ని బయట పెట్టి అరిచి రాద్ధాంతం చేయకుండా ..నెమ్మదిగా తన కాపురం చక్కదిద్దుకోవడానికి ట్రై చేసింది.
ఓ రోజు రెడ్ హ్యాండెడ్ గా హీరోయిన్తో బుక్ అయిన డైరెక్టర్ ఆమెను మరింతగా బాధపెట్టాడు. ఈ క్రమంలోనే ఆ డైరెక్టర్ భార్య “ఓ ఆడదాని దగ్గర లేనిది.. మరో ఆడదాని దగ్గర ఉన్నది ..ఏంటి.. చదువుకున్న నీకు ఆ మాత్రం తెలియదా ..?పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువ ఇవ్వాలనే గౌరవం లేదా..?” అంటూ అడిగి కడిగేసిందట. తాగిన మత్తులో ఉన్న డైరెక్టర్ ఆ మాటలు పట్టించుకోకుండా హీరోయిన్తో సొంత ఇంట్లోనే ఎంజాయ్ చేశాడు . ఈ క్రమంలోనే అది చూసి భరించలేని ఆమె డైరెక్టర్ కు విడాకులు ఇచ్చి ప్రజెంట్ సింగిల్గానే బ్రతుకుతుంది.