వెంకటేష్ సినిమా కాపీ కొట్టి అవ‌తార్ తీశారా…ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్‌…!

ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సినిమా అవతార్ ది వే ఆఫ్ వాటర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇచ్చిన‌ విజువల్ వండర్ కు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా చుస్తున అంత సేపు ప్రేక్ష‌కుడిని మ‌రో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ విషయంలో, నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ప్రేక్షకుడు పెట్టే టిక్కెట్ డబ్బులకు గిట్టుబాటు అవుతుందని ప్రేక్షకుల నుంచి టాక్ వినిపిస్తుంది.

ఇప్పుడు ఈ అవతార్ 2 సినిమాకు ఒక ఇండియన్ సినిమాతో పోలిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతుండ‌డం గమనారం. ఆ సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా నారప్పగా రీమేక్‌ అయింది. తమిళంలో ఆసరాన్ కథతో ధనుష్ హీరోగా నటించాడు. ఇప్పుడు అదే కథతో అవతార్ 2 స్టోరీ కి చాలా దగ్గర పోలికలు ఉండటం విశేషం. అసుర‌న్ సినిమాలో కూడా హీరో తన ఫ్యామిలీని రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లే ఒక తండ్రి కథ.

Glimpse of Narappa : Angry avatar of Venkatesh

ఆ సినిమాలో శత్రువుల దాడిలో ఒక కొడుకుని కోల్పోతాడు. మిగతా ఫ్యామిలీని కాపాడుకోవడానికి హీరో శత్రువులతో పోరాడుతాడు. అవతార్ 2 సినిమా కథ కూడా సేమ్ ఈ కథలాగానే ఉండటంం విశేషం. అయితే ఈ సినిమాల కథ పరంగా కలవడం యాదృచ్ఛికంగానే జరిగి ఉండొచ్చు కానీ.. కోలీవుడ్ జనాలు మాత్రం అవతార్ 2నీ కోలీవుడ్ అసురన్‌ సినిమాకి కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియాలో సరదాగా పోస్టులు పెడుతున్నారు.

ఇందులో మరో విశేషం ఏమిటంటే.. అవతార్1కు కూడా కూడా ఇండియన్ సినిమాతో పోలికలు ఉండటం మరో విశేషం. ఆ సినిమామే.. వియ‌త్నాం కాల‌నీ. అది మోహ‌న్ లాల్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళ మూవీ. ఒక కాల‌నీ వాసుల‌ను ఖాళీ చేయించ‌డానికి విల‌న్ బ్యాచ్ హీరోను అక్క‌డికి పంప‌డం.. అత‌ను త‌ర్వాత వాళ్ల‌లో క‌లిసిపోయి విల‌న్ బ్యాచ్‌ను ఎదిరించ‌డం.. ఈ నేప‌థ్యంలో సినిమా న‌డుస్తుంది.

అవ‌తార్ సినిమా సైతం పాండోరా గ్ర‌హం నేప‌థ్యంలో ఇదే లైన్లో న‌డుస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రం త‌మిళంలో అదే పేరుతో రీమేక్ కావ‌డంతో అవ‌తార్ సినిమాలు రెండిటికీ ఇండియ‌న్‌ సినిమాలే స్ఫూర్తి అంటున్నారు నెటిజ‌న్లు. ప్ర‌స్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.