పులివెందుల కూడా లాస్ట్..ఎంపీదే బాధ్యత.!

గడపగడపకు సంబంధించి తాజాగా జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు…ఇంచార్జ్‌లు, సమన్వయకర్తలతో వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాప్‌లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకు వెళ్ళడంలో విఫలమయ్యారని…తక్కువ రోజులే గడపగడపకు తిరిగారని చెప్పి క్లాస్ ఇచ్చారు. సెప్టెంబర్ 28 సమావేశం తర్వాత ఇప్పటివరకు 78 రోజులు అయింది..అయితే ఇందులో 10-22 రోజులు అంటే చాలా తక్కువ రోజులు తిరిగిన వారు 38 మంది వరకు ఉన్నారు. ఇందులో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, మేరుగ నాగార్జున, విడదల రజని, చెల్లుబోయిన, జోగి రమేశ్‌, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు లాంటి వారు ఆ జాబితాలో ఉన్నారు.

అలాగే పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఇక్కడ మరొక విచిత్రమైన విషయం ఏంటంటే..సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో కూడా గడపగడపకు తక్కువ రోజులు తిరగడం. మామూలుగా అయితే ఇక్కడా జగన్‌కు ఎదురు లేదు..కాబట్టి గడపగడపకు వెళ్లాల్సిన పరిస్తితి లేదు. కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవలంటే ఇంటింటికి వెళ్ళాలి.

అయితే జగన్ పులివెందుల బాధ్యతని ఎంపీ అవినాష్ రెడ్డికి అప్పగించారు. కానీ అవినాష్ రెడ్డి ఇక్కడా చాలా తక్కువ రోజులు మాత్రమే గడపగడపకు వెళ్లారట. అంటే ఇక్కడ ఎలా చూసుకున్న గెలిచేస్తామని ధీమా ఉండవచ్చు..అందుకే గడపగడపకు వెళ్ళినట్లు లేరు. కానీ జగన్ చదివిన లిస్ట్‌లో పులివెందుల కూడా ఉంది. సీఎం నియోజకవర్గంలోనే ఈ పరిస్తితి ఉంటే…మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు కాస్త లైట్ తీసుకుంటారు. కాబట్టి గడపగడపకు విషయంలో పులివెందుల టాప్‌లో ఉంటే ఎమ్మెల్యేలకు అది ఆదర్శంగా ఉంటుంది. మరి ఇకనైనా పులివెందులలో కార్యక్రమం విజయవంతం చేస్తారో లేదో చూడాలి.