మంచు మ‌నోజ్ రెండో పెళ్లి వెన‌క ఇంత పెద్ద క‌థ న‌డుస్తోందా… వామ్మో ఇన్ని ట్విస్టులా…!

మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన మంచు మనోజ్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే తనకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకున్నాడు. కానీ తక్కువ కాలంలోనే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాడు. ప్రస్తుతం మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటాడు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మొదటి భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Manchu Manoj second marriage: మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా..  ఇందులో నిజమెంత..? | Tollywood actor Manchu Manoj second marriage news going  viral in social media and is it true what is the fact

కర్నూలు జిల్లాకు చెందిన దివంగత టిడిపి నేత భూమ నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పెళ్లి విషయం మాత్రం ఇరు కుటుంబాల వారికి ఇష్టం లేదని తెలుస్తుంది. మనోజ్ కూడా తన కుటుంబానికి దూరంగా బయటకు వచ్చేసి ఒంటరిగా ఉంటున్నాడని తెలుస్తుంది. అయితే ఈమధ్య కాలంలో కాబోయే భార్యతో మంచు మనోజ్ వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటూ మీడియా కంటపడ్డాడు.

ఇప్పుడు మళ్లీ చాలా రోజులు తర్వాత మరోసారి మౌనికతో మంచు మనోజ్ మీడియా కంటపడ్డాడు. నిన్న భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్దకు కాబోయే ఈ భార్యాభర్తలు కలిసి వెళ్లి అక్కడ భూమా నాగిరెడ్డికి నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దీనితో పాటు కడపలో ఉన్న ప్రముఖ ధర్గాని కూడా మనోజ్ వెళ్లి దర్శించుకున్నాడు.

అక్కడ మీడియాతో మాట్లాడుతూ మనోజ్ త్వరలోనే నేను నా కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాను అంటూ తన పెళ్లికి సంబంధించిన అప్డేట్ బయటకు వదిలాడు. ఇక ఎప్పుడూ మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు నిజమేనని తేలిపోయింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో వీరు కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది. మనోజ్ కూడా పెళ్లి తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని కూడాా తెలుస్తుంది.