రేవంత్ ని చీట్ చేసిన సొంత తల్లి… ఏ మదర్ కూడా చేయని దారుణమైన పని..!

ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ప్రముఖ సింగర్ రేవంత్ కూడా ఒకరు.. రేవంత్ మొదట నుంచి టాస్కుల్లో హౌస్‌లో అతని కొట్టేవాడు లేడు. కానీ అతని వ్యక్తిత్వంలో మాత్రం ఎప్పుడూ ఎక్క‌డో వెనక స్థానంలో ఉన్నాడు. తన తోటి హౌస్ మెంబర్లను ఎప్పుడు చులకనగా మాట్లాడటం, నేనే గొప్ప అని ఫీల్ అవ్వటం, రేవంత్‌ టాస్క్ లో ఫిజికల్‌గా ఎదుటివారి మీద చేయి చేసుకోవటం, ఓటమిని తట్టుకోలేని తత్వం.. ఇలా చూసుకుంటే రేవంత్ లో చాలా మైనస్లే ఉన్నాయి. కానీ షో మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రేవంత్ ఒకేలా ఉన్నాడు.

Bigg Boss Telugu 6: Housemates talk about their families; Surya and Revanth  compete in captaincy task | PINKVILLA

తన మనసులో ఏది అనుకున్నా అది ముక్కు సూటిగా మాట్లాడటం.. అందరితో గొడవలు పడుతూ మళ్ళీ కాసేపటికి సారీ చెప్పి కలిసిపోతాడు. అలా రేవంత్ లో ప్లస్ లో మైనస్ రెండు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే రేవంత్ కచ్చితంగా విన్నర్ అయ్యే ఊపే కనిపిస్తుంది. అయితే తాజాగా రేవంత్ తల్లి సీతామాలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా భర్త పేరు శంకర. నాకు మొదటి కొడుకు పుట్టాడు తర్వాత రేవంత్ కడుపులో ఉండగానే నా భర్త చనిపోయాడు.

Bigg Boss Telugu 6: Revanth gets emotional speaking to his mom and wife;  Inaya becomes last captain | PINKVILLA

 

నా భర్త లేకపోయినా బంగారంలాంటి పిల్లలు ఉన్నారని ఎప్పుడూ తలుచుకుంటాను. నా భర్త లేకుండా ఇద్దరు పిల్లలు ఈ స్థాయికి తీసుకువచ్చానంటే అది నా కుటుంబం వల్లే. మా అమ్మ నాన్నలు, అన్నయ్యలు, వదిన‌లు నన్ను ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకున్నారు. వారు అండగా లేకపోతే నేను రోడ్డును పడేదాన్ని. రేవంత్‌ పుట్టాక నీకు నాన్న లేడు అని చెప్తే ఎక్కడ మనసులో బాధ పెడతాడో అని నిజం దాచాను మీ నాన్న దుబాయ్ లో ఉంటారు.. త్వరలోనే మన దగ్గరికి వస్తారని చెప్పేవాళ్లం.వాడిని చూస్తే నాకు ఇప్పటికీ బాధగానే ఉంది. ఎందుకంటే వాడు తండ్రి ప్రేమకు దూరమయ్యాడు. దేవుడు ఎందుకు ఈ లోటు ఇచ్చాడని నేను ఎప్పుడూ బాధపడేదాన్ని. రేవంత్ కు నా పలుకులే వచ్చాయి. కానీ అంత కోపం నాకు లేదు. వాడి కోపం కాసేపే ఉంటుంది. తర్వాత మామూలు అయిపోయి సారీ చెప్తాడని ఆమె ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది.