టంగ్ స్లిప్ అవుతున్న చిరంజీవి.. ఇబ్బంది పడాల్సిందేనా..?

మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా వేడుకకు వచ్చిన చాలా అనుకువగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉంటారు. అయితే అదే వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ చుట్టూ ఉన్నవాళ్లను కూడా నవ్విస్తూ ఉంటారు. ఇక గతంలో ఉన్నట్లుగా చిరంజీవి ప్రస్తుతం లేరు.చాలా మారిపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమధ్య అందరితో కూడా చాలా కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల సందర్భంలో ఒక ప్రముఖ అవధాని గురించి కూడా పరోక్షంగా తనదైన స్టైల్ లో సెటైర్ వేసీ అక్కడున్న వారందరి నవ్వించారు. ఆ వీడియో చాలా వైరల్ గా మారింది.

ఇప్పుడు నా పరిస్థితి ఇదీ, నా వద్దకు ఎవరూ తీసుకురాలేదు: చిరంజీవి | Chiranjeevi  speech in Sye Raa Pre Release Event - Telugu Filmibeatఅయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా కొన్ని సందర్భాలలో మెగాస్టార్ టంగ్ స్లిప్ అవుతున్నారనీ అయితే సరదాగా కొన్ని రకాలు కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి తన సినిమా వేడుకకు వచ్చేసిన తనయుడు రామ్ చరణ్ ఈవెంట్ కు వచ్చిన ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా సినిమాకు పని చేసిన టీమ్ మెంబర్స్ తో పాటు ఇతర విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. సినిమా గురించి చెప్పే ప్రాసెస్లో ఆయన కథ గురించి చేయడం అందులో పాత్రల గురించి లీక్ చేయడం వంటివి జరుగుతోంది.

Chiranjeevi: We will always be indebted to Rajamouli - TeluguBulletin.com

అలా రంగస్థలం, ఆచార్య, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలకు ఇలాగే జరిగింది. దర్శకులు రిలీజ్ వరకు ఎంతో సీక్రెట్ గా ఉంచాలనుకున్న విషయాలను సైతం చిరంజీవి తన నోటి ద్వారా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అలా అనుకోకుండా బయటికి వస్తూ ఉంటాయి. దీంతో చిరంజీవికి చేతిలో మైక్ ఉంటే టంగ్ స్లిప్ అవుతున్నారని ఫిలిం ఇండస్ట్రీలో అయితే వార్తలు వినిపిస్తున్నాయి. దీనివల్ల దర్శకులు ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మాట్లాడుతోంది చిరంజీవి కాబట్టి అందరూ నవ్వుతూ వాటిని స్వాగతించడం తప్ప మరేం చేసేది లేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చిరంజీవి రాబోయే కాలంలో జాగ్రత్త పడతారేమో చూడాలి.