చిరంజీవి రూట్ లోనే నాగార్జున కూడ..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా ప్రేక్షకులను మెప్పించడానికి పలు రకాల కాంబినేషన్లు సెట్ చేస్తూ ఉంటారు దర్శక,నిర్మాతలు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సీనియర్ హీరో సినిమాలో ఒక కామెడీ హీరోని సెట్ చేయబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రైటర్ ప్రసన్నకుమార్ మొదటిసారిగా  డైరెక్టర్ గా నాగార్జున హీరోగా పెట్టి తెరకెక్కించబోతున్నారు. అయితే అందులో మరొక హీరో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
All about Chiranjeevi - Ravi Teja characters in Chiru154 -  TeluguBulletin.com
ఇక నాగార్జున సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ అల్లరి నరేష్ కనిపించబోతున్నాడని వార్త వైరల్ గా మారుతోంది. కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన అల్లరి నరేష్ కొంత సమయం తర్వాత మహేష్ నటించిన మహర్షి సినిమాలో నటించి అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.ఆ తర్వాత తనని ఆడియన్స్ సీరియస్గా చూడాలనుకుంటున్న సమయంలో నాంది సినిమాతో బాగా అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమా హిట్ అందుకోవడంతో అదే లెవల్లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలో నటించారు .ఇది పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్లు సమాచారం. ఇప్పుడు నాంది డైరెక్టర్ తోనే మరొక ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Nagarjuna's Film To Have A Popular Hero In A Key Role | cinejosh.com
అల్లరి నరేష్, నాగార్జున సినిమాలు భాగమవుతున్నారనే  వార్త వైరల్ గా మారుతోంది.నాగార్జున వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. అల్లరి నరేష్ కి కూడా ఈ సినిమా మంచి బూస్టింగ్ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రసన్నకుమార్ మొదటిసారి డైరెక్షన్ చేస్తూ ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారనే అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ అనే కీలకమైన పాత్రలో పెట్టుకొని నటించారు ఇప్పుడు నాగార్జున కూడా ఇదే ప్లాన్ వెయబోతున్నట్లు సమాచారం.