ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పరిస్థితి మరింత విషమించిందని మళ్లీ ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుందని వార్తలు చాలా వైరల్ గా మారాయి. అయితే ఎలాంటి కఠినమైన సమస్యలనైనా సరే తను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సమంత ప్రకటించిన సినిమాలను త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha Ruth Prabhu talks about 'easier' resolutions ahead of new year.  See pic - Hindustan Times

కొత్త సంవత్సరంలో కొత్తగా తనని తాను ముందుకు నడిపించేందుకు సమంత సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .సమంత అభిమానులలో కొత్త ఎమోషనల్ తెలిపేలా చేస్తోంది.2022 సంవత్సరాన్ని ముగిస్తున్నందున కొత్త సులభమైన తీర్మానాలు చేయడానికి ఇది సరైన సమయమని చెప్పుకోస్తోంది. ఫంక్షన్.. ఫార్వర్డ్ మన పరిధిలో వాటిని మనం నియంత్రిద్దాం కొత్త ఏడాదికి ముందే సులభమైన రిజల్యూషన్ కోసం ఇదే సరైన సమయమని ఊహించండి. మనపై దయ సున్నితత్వం ఉండాలి గ్లాడ్ బ్లెస్ హ్యాపీ..2023!!2023!! అంటూ తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతోపాటు అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది.

ఇటీవల సమంత నటించిన యశోద సినిమా విడుదల మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సమంత అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం, ఖుషి వంటి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మరి వచ్చే ఏడాది అయినా సమంత తన సినిమాలతో బిజీ హీరోయిన్గా మారిపోతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలో సమంత చాలా క్యూట్ గా కనిపిస్తోంది అందుకు సంబంధించి ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)