చిరంజీవి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన మంచు లక్ష్మి..!!

సాధారణంగా సినిమాలలోని పాటలు ప్రేక్షకులకు నచ్చాయంటే చాలు వాటిని ప్రతిసారి వినడమే కాకుండా పలు సందర్భాలలో డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాలో నుంచి బాస్ పార్టీ సాంగ్ విడుదలై సోషల్ మీడియాని బాగా షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాటకు 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సెలబ్రిటీలను సైతం ఈ పాటకి స్టెప్పులు వేయించాలా చేస్తోంది.

తాజాగా బాస్ పార్టీ పాటకు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కూడా బాగా స్టెప్పులు వేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇందులో రంగస్థలం సినిమాలో నటించిన మహేష్ తో పాటు మంచు లక్ష్మి కలిసి వాల్తేర్ వీరయ్య సినిమాలోని ఈ పాటకు స్టెప్పులు వేయడం జరిగింది. ఈ పాటకు మంచు లక్ష్మీ వేసిన మాస్ స్టెప్పులకు నేటిజన్లను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి. ఈ వీడియో పైన మంచు లక్ష్మి పైన పలు రకాలుగా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.

ఇక ఈ కామెంట్స్ పైన మంచు లక్ష్మి స్పందిస్తూ మంచు చిరంజీవి పాటలకు డాన్స్ వేయడం అంటే చాలా ఇష్టమని అందుకే ఆయన పాటలను అప్పుడప్పుడు ఇలా డాన్స్ చేస్తూ ఉంటానని తెలియజేస్తోంది. ఇదంతా ఇలా ఉండగా చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి బరిలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు పోటీగా బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈసారి సంక్రాంతికి మెగా అభిమానులు నందమూరి అభిమానుల మధ్య ఒక వార్ జరగబోతోంది. మరి ఏ సినిమా గట్టి పోటీ ఇస్తుందో చూడాలి.

https://twitter.com/LakshmiManchu/status/1608322487850532864?s=20&t=qIYxzZ6-r5nsb7bTVChxlQ