ఇష్టం లేకుండానే..చిరంజీవి కోసం అలాంటి పని చేసిన నయనతార..!?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది . అలా చేస్తేనే ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళగలం . కెరియర్ లో ఒక ఎత్తు కి వెళ్లగలం.. ఒక మెట్టు ఎక్కగలం. అదే స్ట్రాటజీలను నమ్ముతున్న నయనతార ఇష్టం లేకపోయినా సరే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఆయనకు సిస్టర్ రోల్ లో కనిపించి .. నటించి..మెప్పించింది. ఎస్ రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గాడ్ ఫాదర్ .

మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ గా నయనతార కనిపించింది. నయనతార భర్తగా సత్యదేవ్ జీవించేశాడు . సినిమా మొత్తానికి వీళ్ళు ముగ్గురి నటన హైలైట్ గా నిలిచింది . మరీ ముఖ్యంగా నయనతార – చిరంజీవి మధ్య వచ్చిన సీన్స్ సినిమాకి సూపర్ బజ్ ని క్రియేట్ చేశాయి. అయితే మొదట ఈ స్టోరీ చెప్పగానే నయనతార.. చిరంజీవికి సిస్టర్ గా నటించలేని అని చెప్పేసి రిజెక్ట్ చేసిందట.

అంతకుముందే చిరంజీవితో భార్య గా స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార ..సిస్టర్ రోల్ లో నటించడానికి అస్సలు ఇష్టం పడలేదట. అయితే మోహన్ రాజా పూర్తి స్టోరీ చెప్పాక ..స్పాట్ లోనే మెగాస్టార్ చిరంజీవి ఆమెకు కాల్ చేసి రిక్వెస్ట్ చేయగానే నయనతార యాక్సెప్ట్ చేసిందట . అయితే సినిమా చూసిన తర్వాత నయనతార రోల్ లో మరి ఏ హీరోయిన్ పెట్టిన సరే ..ఆ పవర్ రాదు రాబోదు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు .

కొన్ని కొన్ని పాత్రలో నయనతారను తప్పిస్తే వేరే వాళ్ళని ఊహించుకోలేరు జనాలు. నయనతార.. మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం కారణంగానే ఇష్టం లేకపోయినా సరే ..ఆయన సిస్టర్ రోల్ లో నటించింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ నయనతార ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే ..మరో పక్క సినిమాలో నటిస్తుంది చూడాలి. చూడాలి మరి చిరంజీవి – నయనతార కాంబో మళ్లీ ఎప్పుడు సెట్ అవుతుందో..?