బిగ్ షాకింగ్: బాలయ్య అన్ స్టాపబుల్ షో ఆగిపోతుంది..ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన ఆహా..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఇప్పటికే సీజన్ వన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో ..రీసెంట్ గానే అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్ ను స్టార్ట్ చేశారు ఆహా. త్వరలోనే అన్ స్టాపబుల్ 2 షో లో ప్రభాస్ ..ఆ తర్వాత సినీ పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం అన్ స్టాపబుల్ సీజన్ 2 కి లాస్ట్ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ ది అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి ఈ సీజన్ కి చాలా ఎపిసోడ్స్ ని ప్లాన్ చేశారట . అయితే బాలకృష్ణ కి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా షోని.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఎండ్ చేసి.. త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్ 3 ని తెరపైకి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

సీజన్ 3 తర్వాత మళ్లీ బ్రేక్ వేసి.. బాలయ్య పాలిటిక్స్ లో బిజీ కానున్నాడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ 2 కి లాస్ట్ గా వచ్చే గెస్ట్ పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మరి చూడాలి దీనిపై ఆహా ఎలా స్పందిస్తుందో ..? ఒకవేళ నిజంగా ఇది నిజమే అయితే సీజన్ వన్ కి మహేష్ బాబు.. సీజన్ 2 కి పవన్ కళ్యాణ్ ఎండ్ కార్డ్ వేయనున్నారు అంటున్నారు జనాలు.