టాలీవుడ్ లెటేస్ట్ సెన్సేషన్స్ “కృతి శెట్టి లో లేనిది..శ్రీలీల లో ఉన్నది ఇదే”.. !!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా ..రోజురోజుకి ఇండస్ట్రీలో హీరోయిన్గా తమ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది ముద్దుగుమ్మలు అడుగుపెడుతుంటారు. అయితే పదిమంది ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెడితే సక్సెస్ అయ్యేది ఇద్దరంటే ఇద్దరే ..వాళ్ళల్లో కూడా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతారు అని చెప్పలేం ..అలాంటి సిచువేషన్ నెలకొంది సినిమా ఇండస్ట్రీలో.. కాగా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ లో ఇద్దరు కుర్ర బ్యూటీల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది .

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ గా పేరు సంపాదించుకున్న కన్నడ బ్యూటీ కృతి శెట్టి – శ్రీ లీల ఎలాంటి ఫామ్ లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . కృతి శెట్టి ఇప్పటికే ఆరు సినిమాలు చేసింది . అందులో మూడు సినిమాలు ఫట్.. మూడు సినిమాలు హిట్ ..అన్న విధంగా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంది . ఇక శ్రీలీలా చేసింది రెండు సినిమాలే ..కాని ఖాతాలో ఏడు సినిమాలకు పైగానే ఉన్నాయి. చేసిన రెండు సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి. ఈ క్రమంలోని ఇంటర్నెట్లో శ్రీ లీల VS కృతి శెట్టి పేర్లు ఇంట్రెస్టింగ్గా మారాయి.

చాలామంది కృతి శెట్టి క్లాస్ రోల్స్ కి ..పద్ధతిగా ఉండే లుక్స్ కి పనికొస్తుందని . కానీ శ్రీ లీల అలా కాదు క్లాస్ , మాస్ రెండిటిని మడతట్టేస్తుందని ..రీసెంట్గా ధమాకా మూవీలో ఆమె చేసిన జింతాక పెర్ఫార్మెన్స్ , పల్సర్ బైక్ ఏ రేంజ్ లో ఉన్నాయో మనం చూసిందే అంటూ చెప్పుకొస్తున్నారు . చాలామంది జనాలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు . కృతిశెట్టి హాట్ డాన్స్ వేయలేదని ..ఆమె లుక్స్ క్లాస్ గానే బావుంటాయని ..శ్రీలీల మల్టీ టాలెంటెడ్ అని క్లాస్ మాస్ రొమాంటిక్ అదిరిపోతుందని అందుకే శ్రీ లీలలు ఎక్కువ మంది హీరోలు సినిమాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు అంటూ క్లారిటీ ఇస్తున్నారు చూడాలి చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి కృతి శెట్టి తనలోని మైనస్లను ప్లస్ గా ఎలా మార్చుకుని శ్రీలీల కు ఎలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుందో..?