ఇయర్ ఎండింగ్లో దీపికా పదుకొనే కు షాక్ తగిలిందా..!!

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే షారుక్ ఖాన్ కలిసి నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి అందులో బేషరాం పాట విడుదల అవ్వగానే పెద్ద దుమారం రేపింది. ముఖ్యంగా కేవలం ఒక్క బికినీతోనే దేశాన్ని కుదిపోయొచ్చని పాటను చూసి చెప్పవచ్చు. ఇక ఎంతోమంది రాజకీయ పార్టీల మధ్య మాటలు యుద్ధం కూడా నడిచింది. మరి కొంతమంది దీపికా పదుకొనే షారుక్ ఖాన్ ఫోటోలను కూడా దగ్ధం చేశారు.

How Much Did Shah Rukh Khan And Deepika Padukone Charge For Pathaanమరొకవైపు దీపిక స్కిన్ షోపై సోషల్ మీడియాలో కూడా పలు రకాలుగా కామెంట్లు వినిపించాయి. ముఖ్యంగా వివాహమైన హీరోయిన్ ఇలాంటి పనిచేయడంతో పెద్ద దుమారం రేపింది. పఠాన్ చిత్ర బృందం మాత్రం ఏ ఒక్క విషయాన్ని కూడా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తోంది చిత్ర బృందం. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా పైన వేటుపడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెన్సార్ వారు నేరుగా రంగంలోకి దిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీపిక బికినీ తో సహా పాటలోని ఆమె అందాల పైన పలు చర్యలు తీసుకోవాలని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాటలోని పలుమార్పులు చేయాలని కూడా సెన్సార్ బోర్డ్ మేకర్స్ ను కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Deepika Padukone's Bikini and Swimwear Photos Will Set Your Screen On Fireముఖ్యంగా సినిమా రిలీజ్ కి ముందే ఇలాంటి వివాదాలు మంచివి కాదని కూడా సెన్సార్ బోర్డ్ నిబంధనను పాటించాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. దీంతో పఠాన్ చిత్రంలోని కొన్ని మార్పులు చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బికినీ రంగుతో సహా దీపిక స్కిన్ షో ని బ్లర్ చేయనున్నట్లు సమాచారం. మరి సెన్సార్ ఆదేశాలను ప్రకారం ఈ సినిమాలోని మార్పులు చోటు చేసుకుంటాయో లేదో చూడాలి మరి.. ఇయర్ ఎండింగ్ లో దీంతో దీపికా పదుకొనేకి గట్టి సాకే తగిలిందంటూ కామెంట్ చేస్తున్నారు.