అబ్బో.. సెకండ్ ఇన్నింగ్స్ లో మరీ ఓవర్ చేస్తున్న త్రిష.. అమ్మడు కండీషన్స్ మామూలుగా లేవుగా..!!

దీపం వెలుగుతున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి ..ఇది ఒకప్పుడు సామెత ..ప్రజెంట్ ట్రెండ్ మారింది ..క్రేజ్, ఫామ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోవాలి ..ఏద్ది కావాలని అన్నా డిమాండ్ చేయాలి.. కావాల్సిన కోరికలు అడిగి మరీ తీర్చుకోవాలి . ప్రజెంట్ ఇదే ఫార్ములాను అప్లై చేస్తున్నారు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్. మనకు తెలిసిందే ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఎలాంటి పొజిషన్లో ఉందో . ఏ హీరోయిన్ ఎప్పుడు ఉంటుందో ..ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్ ఎప్పుడు పాపులారిటీ దక్కించుకుంటుందో అర్థం కాని పొజిషన్లో సినీ ఇండస్ట్రీ కొట్టుమిట్టాడుతుంది.

కాగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండస్ట్రీ ను షేక్ చేసిన చెన్నై ముద్దుగుమ్మ త్రిష ..సెకండ్ ఇన్నింగ్స్ లోను అదేవిధంగా ఇండస్ట్రీను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి తెగ ట్రై చేసేస్తుంది. పెరుగుతున్న కాంపిటీషన్ కి కుర్ర బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని అందాన్ని మెయింటైన్ చేస్తూ ..కుర్రాలను టెంప్ట్ చేసేస్తుంది . పోనియన్ సెల్వన్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ త్రిష.. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస క్రేజీ ఆఫర్స్ ని పట్టేసి ..కోలీవుడ్ మీడియాను షేక్ చేస్తుంది.

కాగా ఇప్పటివరకు టాలీవుడ్ లో అమ్మడు ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు. దానికి మెయిన్ రీజన్ అమ్మడు రెమ్యూనరేషన్ ..సెకండ్ ఇన్నింగ్స్ లో హాట్ బ్యూటీస్ ని మించి పోయే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది త్రిష అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష క్రేజీ కండిషన్స్ పెడుతుందట. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎంత ఫ్రీగా డైరెక్టర్స్ తో మూవ్ అయిందో ..సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఎక్కడికక్కడ డైరెక్టర్స్ ని కట్ చేస్తూ పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని డిసైడ్ అయిందట .

ఈ క్రమంలోనే చిన్న హీరోల సినిమాలో అవకాశాలు వస్తే రిజెక్ట్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన సినిమాకి సైన్ చేయాలంటే కచ్చితంగా తను మొదట హీరోయిన్ గానే ఉండాలి.. అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి ..కాల్ షీట్లు కూడా తన సమయానుసారం సెట్ అయ్యే విధంగానే ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటుందట. అంతేకాకుండా త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో కొందరు హీరోస్ తో చేయకూడదని గిరిగిసి పెట్టుకుందట . ఇదే క్రమంలో టాలీవుడ్ లో ఒకప్పటి త్రిష జాన్ జిగిడి దోస్త్ తో అవకాశం వచ్చిన సరే ఆమె నటించడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా సినిమాని రిజెక్ట్ చేసిందన్న రూమర్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఇవన్నీ చూస్తున్న జనాలు సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష మరి ఓవర్ చేస్తుంది అంటూ టంగ్ స్లిప్ అవుతున్నారు . అంతేకాదు ఇదేవిధంగా కొనసాగితే వచ్చే ఆఫర్లు కూడా దొబ్బేస్తాయి జాగ్రత్త అంటూ వార్న్ చేస్తున్నారు నెటిజెన్స్. చూడాలి మరి త్రిష ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?