అమ్మ బాబోయ్.. బన్నీతో పెళ్ళి కి అత్తగారు స్నేహ కి అలాంటి కండీషన్ పెట్టిందా..?

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, ప్రేమ పెళ్లిలు చాలా కామన్ . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ – హీరోయిన్స్ ఓ సినిమా షూట్ చేస్తున్న టైంలో ప్రేమలో పడి ..ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి . అయితే ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలా తక్కువ. ఆ లిస్ట్ లోకే వస్తాడు టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ . సినిమా ఇండస్ట్రీలో హ్యూజ్ గర్ల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ..సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

2011 మార్చి ఆరవ తేదీన వీళ్ల పెళ్లి గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగింది . అయితే పెళ్లి టైం లో చాలా హ్యాపీగా కూల్ గా కనిపించిన బన్నీ.. స్నేహారెడ్డిని అల్లు ఇంటి కోడలుగా చేయడానికి నానాతంటాలు పడ్డాడట. మరీ ముఖ్యంగా పెళ్లి విషయంలో వాళ్ళ అమ్మ పెట్టిన కండిషన్స్ పూర్తి చేసేసరికి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అల్లు అర్జున్ అమ్మగారు మొదటి నుంచి చాలా సాంప్రదాయ బద్ధంగా ఉండే అమ్మాయిని తన ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలని ఆశపడిందట .

అయితే పెరుగుతున్న టెక్నాలజీకి మారుతున్న కాలానికి ఆమెలో కూడా కొన్ని మార్పులు వచ్చి ..తన ఇంటి కోడలు ఎలా ఉండాలో కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారట. బయటకి మోడ్రన్ గా కనిపించినా.. పెళ్లిలకి, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు చాలా పద్ధతిగా రెడీ అవ్వాలని ..మరి ముఖ్యంగా పెద్దలకి గౌరవించాలని ..అందరి హీరోయిన్స్ లా పెళ్లి తర్వాత పిల్లలను కనడానికి చాలా గ్యాప్ తీసుకోకూడదని.. త్వరగా పిల్లల్ని కనేసి ఇంటి కి మనవాళ్ళను మనవరాళ్లను ఇవ్వాలని ఆశ పడిందట .

అదే విధంగా స్నేహాన్ని బన్నీ పరిచయం చేయగానే ఆమెఆ కండిషన్స్ వివరిచ్చిందట. అయితే అత్త మాటను తూ చా తప్పకుండా పాటించే స్నేహ.. అత్త చెప్పిన కండిషన్స్ అన్ని ఫాలో అవుతుంది . ఆ కారణంగానే అల్లు అర్జున్ అమ్మగారికి స్నేహ అంటే మరింత ఇష్టమట . ఏది ఏమైనా సరే స్నేహ రెడ్డి అల్లు ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ కోడలు అని చెప్పాలి.