బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలను పవన్ ఎన్ని చేశాడో తెలుసా..?

ఇండస్ట్రీలో ఒక హీరో నటించను అని రిజెక్ట్ చేసిన సినిమాలను ఇంకో హీరో చేయడానికి రెడీ అవుతారు. అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. అందులో ‘భీమ్లా నాయక్’ మూవీ లాంటి కొన్ని చిత్రాలున్నాయి. తాజాగా నందమూరి బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా విచ్చేసారు. దాంతో మరోసారి వీళ్లిద్దరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ వదులుకున్న పవన్ సినిమాలు ఏంటి అని చాలామంది వెతుకుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాని తెలుగులో ‘భీమ్లా నాయక్’ సినిమా పేరుతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ రీమేక్ చేసారు. అయితే మొదట ఈ సినిమాలో బాలకృష్ణని హీరోగా తీసుకుందాం అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ని హీరోగా తీసుకొని భీమ్లా నాయక్ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా బాగానే ఆడింది.

ఇక ‘అన్నవరం’ సినిమా బాలకృష్ణకు సెట్ అవుతుందని పరుచూరి బ్రదర్స్ భావించి మొదటగా ఆ మూవీ స్టోరీను వినిపించారు. అన్నవరం స్టోరీ విని బాలయ్య కూడా ఇంప్రెస్ అయ్యారు. బాలకృష్ణ నటించిన ‘ముద్దుల మావయ్య’ సినిమా తర్వాత ఆ స్థాయిలో సిస్టర్ సెంటిమెంట్ అన్నవరం సినిమాలో ఉండటంతో ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో అన్నవరం సినిమాని బాలకృష్ణ వదిలేసుకున్నారు.

ఇక గత ఏడాది దిల్ రాజు దర్శకత్వం వహించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడా బాలకృష్ణని హీరోగా తీసుకోవాలనుకున్నారు. కానీ ఈ సినిమా స్టోరీ తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ కాదని, తను ఈ సినిమాలో నటించనని చెప్పేసారట. దాంతో పవన్ కళ్యాణ్ ని హీరో గా తీసుకొని వకీల్ సాబ్ సినిమాని తెరకెక్కించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ స్టోరీని కూడా ఆ మూవీ డైరెక్టర్ క్రిష్ మొదట బాలయ్యకు వినిపించారట. కానీ బాలకృష్ణ ఈ సినిమా స్టోరీ రిజెక్ట్ చేయడంతో, పవన్ కళ్యాణ్‌కి ఈ సినిమా స్టోరీ చెప్పి ఈ మూవీ లో నటించడానికి ఒప్పించారట. ఈ సినిమా 2023, మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మొతానికి బాలయ్య రిజెస్ట్ చేసిన స్టోరీలు అన్ని పవన్‌కి మంచి సక్సెస్‌ ని అందిస్తున్నాయనే చెప్పాలి. అయితే ఈ హరి హర విరమల్లు సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందేంమో చూడాలి మరి.