ఈ సంక్రాంతికి టాలీవుడ్లో భారీ భాక్సాఫీస్ వార్ జరగబోతుంది. టాలీవుడ్ అగ్ర హీరోలు అయన చిరంజీవి-బాలకృష్ణ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నరు. ముందుగా బాలయ్య వీరసింహరెడ్డి తో రాగా తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్యతో వస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. తాజాగా చిరు నటిస్తున ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ప్రెస్ మీట్ లో ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలు హిట్ అవుతాయంటూ.. చిరంజీవి కూడా బాలకృష్ణకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
దీంతో ఇప్పడు ఈ ఇద్దరి హీరోలను ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి, బాలకృష్ణ మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులు. గతంలో కూడా బాలయ్య.. ఇండస్ట్రీలో తను సన్నిహితంగా ఉండేది చిరంజీవితోనే అని చాల సార్లు చెప్పారు. అయితే ఈ సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోల తమ సినిమాలతో వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలను కలిపి ఓకే ఇంటర్వ్యూ చేస్తే ఎలా ?ఉంటుంది అనే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.
విడుదలకు ముందు నుంచే ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాల ప్రమోషన్స్ ని ఒకే వేదికపై నిర్వహించాలని మైత్రి వారు భావిస్తున్నారుట. అయితే దీనికి చిరంజీవి, బాలకృష్ణ ఒప్పుకోవాలి. తమ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్న సమయంలో చిరంజీవి, బాలయ్య కలిసి ఒకే ఇంటర్వ్యూలో కనిపిస్తే ఓ రేంజ్ లో ఆ సినిమాలపై బజ్ వస్తుంది.
టాలీవుడ్లో కూడా ఒక మంచి సంప్రదాయానికి తెర తీసినట్లు అవుతుంది. వారి అభిమానుల మధ్య కూడా ఈగోలు, గొడవలు తగ్గుతాయి. మరి దీనికి ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఓకే చెబుతారా లేదా ? అనేది చూడాలి. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మిడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు హీరోల అభిమానులు ఇది నిజమవ్వాలని మాంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నారు.