బుకింగ్స్‌లో ఫ‌స్ట్‌ రిలీజ్‌లా దుమ్ము రేపుతోన్న ‘ ఖుషి ‘ … వామ్మో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఏంట్రా బాబు…!

ఇటీవ‌ల కాలంలో స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి న‌టించిన సూప‌ర్ హిట్‌ సినిమాల‌ను రీ రిలీజ్ చేయ‌డం ఇప్ప‌డు ట్రెండ్‌గా న‌డుస్తుంది. ఇప్పుడు తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లాసిక్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మరో సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. 2001లో వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘ఖుషి’. అ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక చావ్లా హీరోయిన్ గా న‌టించింది.

ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మ‌ళ్ళీ ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత‌ రీ రిలీజ్ చేస్తుండ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా క్రేజ్ ఇప్పుడే మొద‌లు అయ్యింది. ఈ సినిమా డిసెంబర్ 31న ఎంతో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఈ సినిమాను సెన్సేషన్ అయ్యేలా తమ వంతు కృషి చేస్తున్నారు.

ఇటీవలే పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల‌ కోసం జల్సా సినిమాను రీ రిలీజ్ చేసారు.
ఈ సినిమా ఏకంగా రూ.2.85 కోట్ల వసూళ్లు రాబ‌ట్టుకుని… రీ రిలీజ్ సినిమాల‌ క్యాటగిరీలోనే ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది. మరి ఇప్పుడు జల్సా కంటే కూడా ఖుషి ఈ సినిమా విషయంలో ప‌వ‌న్‌ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. జల్సా రీ రిలీజ్ సమయంలో కూడా ఫ్రి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి.

Mega Surya Production on Twitter: "Re-live Evergreen Romance in theatres  near you from 31 Dec! 😍 #KushiReRelease Enjoy once again the ever-lasting  Magic of love #Kushi ✨ @PawanKalyan @iam_SJSuryah @bhumikachawlat  @pcsreeram #ManiSharma @

మరి ఇప్పుడు జ‌ల్సా సినిమాను మించి రీ రిలీజ్ అవ్య‌బోతున్న ఖుషి సినిమాకు ఎక్కువ బుకింగ్స్ నమోదు అవుతున్నట్టు తెలుస్తుంది. మ‌రి ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ ని నమోదు చేసుకుంటోంద‌న్న‌ టాక్ వినిపిస్తుంది. ఖుషి రీరిలీజ్‌తో ప‌వ‌న్ అభిమాలు ఎలాంటి రికార్ట్‌లు క్రియేట్ చేస్తారో చూడాలి.