అడ్వాన్స్ బుకింగ్స్ లో `ఖుషి` ఆల్ ఇండియా రికార్డ్‌.. ఇదేం క్రేజ్ రా సామి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అభిమానుల ఆల్ టైం ఫేవరెట్ మూవీ `ఖుషి`. ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్గా నటించింది. శ్రీ సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎం. ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అభిమానుల కోరిక మేరకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఖుషి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

 

న్యూ ఇయ‌ర్‌ కానుకకు డిసెంబర్ 31న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ కాబోతోంది. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో సూర్యుడు పొద్దు పొడవకుండానే షోలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆల్ ఇండియా రికార్డును క్రియేట్ చేసింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతీ చోట క్ష‌ణాల్లో టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి. దీంతో ఇదేం క్రేజ్ రా సామి అంటూ నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లో ఖుషి ప్రభంజనం సృష్టిస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 150 షోస్ ఓపెన్ చేస్తే అన్ని షోలు దాదాపుగా హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ సినిమాకి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే హైదరాబాద్ నుండి రూ. 1.2 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన ప్ర‌తీ ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ ని ఖుషి చిత్రం కేవలం హైదరాబాద్ సిటీ నుండే బ్రేక్ చేసి రికార్డు సృష్టించింది. రీ రిలీజ్ లు ట్రెండ్ డౌన్ అవుతున్న సమయంలో ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించేదే. మ‌రి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డుల‌ను సృష్టిస్తుందో చూడాలి.