టాలీవుడ్ నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ..నటనలో తాతకు తగ్గ మనవడుగా మంచి మార్కులతో దూసుకుపోతున్నాడు. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుని అభిమానులను సాటిస్ఫై చేసిన నందమూరి హీరో తారక్ ..త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్లో రాబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడు. అయితే నిజానికి ఈ సినిమా ఫిక్స్ అయ్యి చాలా నెలలు కావస్తుంది . ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందే ఈ సినిమా మాటలు చర్చలు జరిగాయి. ఆర్ఆర్ఆర్ సినిమా సగంలో ఉండగా ఈ సినిమాను ఫైనలైజ్ చేశాడు.
ఇక సినిమా పూర్తయిన తర్వాత అఫీషియల్ గా కన్ఫామ్ చేశాడు . ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు . అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయలేదు మేకర్స్. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ కొరటాల శివ పై గుర్రుగా ఉన్నారు . అసలే కొరటాల శివ ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంతో జనాలు ఏకిపారేస్తున్నారు . అంతేకాదు పలు ఈవెంట్లో చిరంజీవి సైతం కొరటాల శివ పై పరోక్షకంగా చేసిన కామెంట్స్ మనకు తెలిసిందే. డైరెక్టర్ తమ తీరు మార్చుకోవాలి అని జనాలు అభిరుచులకు తగ్గట్టు సినిమాలు తీయాలని పరోక్షకంగా కొరటాలకు కౌంటర్ వేశాడు.
దీంతో కొరటాల శివ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది . ఇలాంటి టైం లో కొరటాల శివ త్వరగా ఎన్టీఆర్ తో సినిమా తీసి హిట్ అందుకుంటే.. ఆయనకు మళ్లీ పూర్వ వైభవం అందుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే కొరటాల మాత్రం ఎందుకో తారక్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేకపోతున్నాడు . మూహుర్తం ఫిక్స్ చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతున్నారు. అయితే ఎన్టీఆర్ అయినా సరే కొరటాలను పుషప్ చేయాలి అని త్వరగా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ఫోర్స్ చేయాలి అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ఎన్టీఆర్ కొరటాలని మాత్రం గుడ్డిగా నమ్మేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ కూడా సెలెక్ట్ చేయని కొరటాల ..సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తాడు ..ఎప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తాడు.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎన్టీఆర్ అయినా సరే త్వరగా ఈ విషయంలో లీడ్ తీసుకుని అభిమానులకు ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుంది అంటూ నందమూరి అభిమానులు చెప్పుకొస్తున్నారు . చూద్దాం ఎన్టీఆర్ ఏం చేస్తాడో..?