తమిళ సూపర్ స్టార్ అజిత్ అంటే తెలియని వారు వుండరు. అజిత్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ పేరు తుణివు. G సంస్థతో కలిసి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి బోణీ కపూర్ ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నెర్కొండ పార్వాయి, వాలిమై తరువాత దర్శకుడు వినోద్ – అజిత్ కాంబినేషన్లో వస్తోన్న 3వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే అవకాశం వుంది. ఈక్రమంలో ఈ సినిమా నుంచి రకరకాల అప్ డేట్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటున్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ మంజు వారియర్ ఈ సినిమాలో నటిస్తోంది. జిబ్రాన్ ఈ సినిమానకు మంచి స్వరాలు సమకూర్చుతున్నారు. ఇక ఈమూవీకి సంబంధించి ఓ అప్ డేటన్ ను హీరోయిన్ మంజు వారియర్ తాజాగా ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. విషయం ఏమంటే ఈ సినిమా కోసం తను ఓ పాట పాడినట్టు వెల్లడించారు. అంతే కాకుండా జిబ్రన్ తో కలిసి ఉన్న ఓఫోటోను ఆమె సోషల్ మీడియాలో శేర్ చేసుకున్నారు. ఈసినిమా వచ్చే సంక్రాంతి రేసులో ఉండగా.. అదే సమయానికి విజయ్ వారీసు కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇకపోతే మరోపక్క టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి – దిల్ రాజు నిర్మాణంలో తమిళ బాక్సాఫీస్ మొగుడు విజయ్ సినిమా ‘వారిసు’ కూడా సంక్రాంతికే అంటున్నారు. ఈ విషయంలో అజిత్ – విజయ్ మధ్య పోటీ తప్పడం లేదని అనిపిస్తోంది. మరో వైపు టాలీవుడ్ లో కూడా వారసుడు సినిమాపై గట్టిగా చర్చ నడుస్తోంది. అటు తమిళనాట విజయ్-అజిత్ ప్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తూ బగ్గుమంటుందనే విషయం తెలిసినదే. అటువంటి పరిస్థితుల్లో సంక్రాంతి వార్ ఎలా ఉండబోతుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.