చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. కొంతమంది హీరోయిన్లు మాత్రం మొదటి రెండు సినిమాలతోనే ఎవరు ఊహించని క్రేజ్ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ కోవలోకే పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల వస్తుంది. టాలీవుడ్ లో తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో తన నటనతో అభినయంతో గ్లామర్ షో తో ప్రేక్షకులకు దగ్గర అయింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ శ్రీలీలకు సూపర్ క్రేజ్ వచ్చింది.
ఆ సినిమా తర్వాత నుండి టాలీవుడ్ లో ఉన్న యువ హీరోలు అందరూ ఈ ముద్దుగుమ్మ వెనకాలే పడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో ఆరు సినిమాలకు పైగా నటిస్తుంది. వాటిలో రవితేజ ధమాకా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ధమకాలో రవితేజతో శ్రీలీల రొమాన్స్ అదిరిపోయిందనే అంటున్నారు.
ఈ సినిమాతో పాటు రామ్ – బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా సెట్ అయింది. ఈ సినిమాలే కాకుండా అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా శ్రీలీల బాలకృష్ణకు కూతురుగా నటిస్తుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ssmb28లో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా. సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు శ్రీలీల ఎంపికైనట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. మహేష్ పక్కన ఛాన్స్ అంటే శ్రీలీల నక్క తోక తొక్కేసినట్టే..!