నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బాలయ్య కెరియర్లో అత్యంత హైప్ తీసుకొచ్చిన సినిమాలలో ఒక్క మగాడు ఒకటి. ఇక ఈ సినిమాను సక్సెస్ ఫుల్ దర్శకుడు వైవిఎస్ చౌదరి తెరకెక్కించాడు. బాలకృష్ణ, వై.వి.ఎస్ చౌదరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అభిమానులకు అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తూ సినిమాపై భారీ స్థాయిలో హైప్ తీసుకొచ్చారు. కానీ సినిమా రీలిజ్ అయ్యాక ఎవరు ఊహించిన విధంగా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాకి ఈ స్థాయిలో హైప్ రావడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో వచ్చే మొదటి సాంగ్ కూడా ప్రధాన కారణం. ఆ పాటను రాయలసీమలోని పలు ప్రాంతాలలో భారీ జనం మధ్య తెరకెక్కించారు. అందులో బాలయ్య వైట్ అండ్ వైట్లో అదిరిపోయే లుక్ లో కనిపిస్తాడు. రాయలసీమలో ముఖ్యమైన ప్రాంతాలలో ఈ పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టు అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో భారీ
హైప్ క్రియేట్ చేశారు. తీరా సినిమా డిజాస్టర్ అయ్యి నిరాశ పరిచింది.
అయితే ఇప్పుడు బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో కూడా మొదటి పాటలో కూడా బాలయ్య ఒక్క మగాడు గెటప్ లో కనిపిస్తున్నాడు. జై బాలయ్య అంటూ వచ్చిన పాటను కూడా రాయలసీమ ప్రాంతాల్లోనే తెరకెక్కించారు. ఈ పాటలోను బాలయ్యను పొగిడేలా లిరిక్స్ ఉండటం విజువల్స్ కూడా ఒక్క మగాడు సంబంధించిన విజువల్స్ ఉండటం అభిమానులు ఈ పాటను చూస్తుంటే ఒక్క మగాడులో వచ్చే పాట గుర్తుకు రాకుండా ఉండదు.
బాలకృష్ణగా కూడా ఈ పాట షూటింగ్ సమయంలో ఒక్క మగాడు పాట గుర్తుకు వచ్చిందని చెప్పాలి.. సెంటిమెంట్లను బాగా నమ్మే బాలకృష్ణ మళ్ళీ అలాంటి పాటలో నటించాడంటే.. ఈ సినిమాపై బాలకృష్ణ కు ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వీరసింహారెడ్డి సినిమాతో బాలకృష్ణ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.