సావిత్రి తన సమాధి పైన అలాంటి పదాలు రాయమని ఎందుకు చెప్పింది..!!

తెలుగు సినీ పరిశ్రమలో గర్వించదగ్గ హీరోయిన్లలో మహానటి సావిత్రి కూడా ఒకరు. ఇక సావిత్రి ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామంలో జన్మించింది. ఇక సినిమాలు ఉన్న ప్రేమతో ఈమె తన సొంత ప్రదేశాన్ని వదిలి.. మద్రాసుకి వెళ్లి అక్కడ సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడిందని చెప్పవచ్చు. తన నటనపై ఉన్న ప్రేమతో టాలెంటును నిరూపించుకొని సినీ ఇండస్ట్రీలో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది హీరోయిన్ సావిత్రి. ఇక ఈమెను ఎక్కువగా మహానటి అని పేరుతో పిలుస్తూ ఉంటారు.

Savitri: A legend like none other - The Hindu
స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో ఈమె డేట్ల కోసం దర్శకులు సైతం క్యూలో నిలబడేవారు అంతేకాకుండా స్టార్ హీరోలు సైతం సావిత్రి డేట్ల కోసం వేచి ఉన్న రోజులు కూడా చాలానే ఉన్నాయట. కొన్ని సందర్భాలలో హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న నటిగా కూడా పేరు సంపాదించింది సావిత్రి. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ తదితర హీరోలు సైతం సావిత్రితో నటించడం అదొక గొప్ప అనుభవం అని తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక దీంతో సావిత్రి నటన ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సావిత్రి జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించిందో.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహానటి సినిమాలో చూపించారు.

సావిత్రిని అందరూ మోసం చేయడం వల్ల దిక్కుతోచని స్థితిలో కన్నుమూయడం జరిగింది. తెలుగు తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా స్టార్ హీరోయిన్గా రాణించిన సావిత్రి చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో చాలా సతమతమైందని వార్తలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ఇక సావిత్రి చనిపోయే ముందు ఒక కోరిక కోరుకున్నదట.. అదేమిటంటే తన సమాధి పైన ఒక వాక్యం రాయాలని కోరిందట.”మరణం లోనూ.. జీవితంలోనూ.. ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటుంది.. ఇక్కడికి వచ్చిన ఎవరూ కూడా తన పై సానుభూతితో కన్నీళ్లు కార్చకండి.. కేవలం ఒక పూలమాలని ఉంచండి అంటూ సావిత్రి కోరినట్లుగా ఆమె సన్నిహితులు సైతం చెబుతూ ఉంటారు.