నంద‌మూరి ఫ్యామిలీపై విష్ణు సంచ‌ల‌నం రేపే వ్యాఖ్య‌లు…!

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎంపిక అయి ఇప్పటికి ఏడాది కావస్తోంది ఈ సందర్భంగా మీడియా సమావేశం ముందర పలు విషయాలను తెలియజేశారు. మా కు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త నటీ నటుల ఎవరైనా.. కనీసం రెండు చిత్రాలలో అయినా నటించి అవి విడుదలయ్యాయి అంటే కచ్చితంగా వారికి శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు లేదంటే ఏదైనా కొన్ని చిత్రాలలో ఐదు నిమిషాలైనా కనిపించిన మా అసోసియేషన్ సభ్యత్వం కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. అయితే అలా సభ్యత్వం పొందిన ఐదేళ్ల తర్వాత మాత్రమే మా మెంబెర్ గా ఓటు హక్కు కల్పిస్తామని ప్రకటించారు.

Vishnu responds about controversies of Manchu Family
అంతేకాకుండా మా విషయంలో మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా వారి పైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి సభ్యత్వం కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా సరే మా వ్యక్తిగత విషయాల పైన తప్పుగా మాట్లాడవచ్చు కానీ.. మా కుటుంబం గురించి కన్నతల్లి గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం వెంటనే సభ్యత్వం నుంచి తీసివేస్తామని ఐదేళ్ల లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటేనే ఓటు హక్కుగా పరిగణిస్తామని తెలిపారు.

Balakrishna & Manchu Vishnu Kulaanubandham Rocks! | cinejosh.com

అయితే ప్రస్తుతం 900 మంది సభ్యులు మాత్రమే ఉన్నారని.. నా సర్వీస్ స్ఫూర్తి అయ్యే లోపు ఇంకా 300 మంది చేరుతారని అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కానీ ఓటు మాత్రం ఐదేళ్ల తర్వాతే వస్తుందని మంచు విష్ణు తెలిపారు. అయితే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో పెద్దలను కలవాలని తెలిపారు .ఆ పెద్దలలో తన తండ్రి, బాలకృష్ణ గారు, గిరిబాబు గారు, శివకృష్ణ గారు ,జయప్రద గారు ,అన్నపూర్ణ గారు తాము చెప్పిన ఏదైనా విషయం తప్పని అంటే కచ్చితంగా మేము సైలెంట్ అవుతాము. నేను పది సంవత్సరాలు, 20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నానని తెలిపారు. ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని రూల్స్ మార్చామంటూ తెలియజేశారు మంచు విష్ణు. ఇక తమ కుటుంబానికి ఎంతో సపోర్టుగా నిలిచిన బాలకృష్ణకు గారికి కూడా ధన్యవాదాలు అని తెలిపారు.