ఎన్టీఆర్ కు అన్నగారు అనే పేరు వెనక ఇంత కథ ఉందా..!!

నందమూరి తారక రామారావుకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.తెలుగు సినీ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కేవలం నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ ఇతరుల కన్నా ప్రత్యేకంగా ఉండే వారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎన్టీఆర్ను మాత్రం పలు రకాలుగా పేర్లతో పిలుస్తూ ఉండేవారు. అలాంటి వారిలో తాపినేని రామారావు.. ఎన్టీఆర్ ను రామారావు గారు అని పిలుస్తూ ఉండేవారట. ఇక కమలాకర్ కామేశ్వరరావు మాత్రం ఎన్టీఆర్ ను సరదాగా దొంగరాముడు అని పిలుస్తూ ఉండేవారట.

Dasari: దర్శకరత్నతో దాసరి నారాయణ రావుతో నందమూరి హీరోలు.. ఫోటోస్ వైరల్.. |  Legendery Director Dasari Narayana Rao With Nandamuri Heroes Like NTR  Balakrishna Jr NTR See Old Pics– News18 Telugu

అయితే ఎంతోమంది మాత్రం ఎన్టీఆర్ ను ప్రేమగా అన్నగారు అని పిలుచుకుంటూ వుండేవారు. అయితే ఎన్టీఆర్ను మొదటిసారి అన్నగారు పిలిచిన వ్యక్తి మాత్రం దాసరి నారాయణ రావే అన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీ రామారావు కు దాసరి గారికి మధ్య స్నేహబంధం చాలా బాగా ఉండేదట. ఆ కారణంగానే ఎన్టీఆర్ కి అన్నగారు అని పేరు పెట్టారట. ఎన్నో సందర్భాలలో మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ ని అన్నా అని పిలవడంతో మిగతావారు కూడా ఎన్టీఆర్ ని అన్నా అని పిలుస్తూ ఉండేవారట.

NTR - Dasari: నటరత్న ఎన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణ రావు టాలీవుడ్ బ్లాక్  బస్టర్ కాంబినేషన్.. | NTR - Dasari Senior NTR Director Dasari Narayana Rao  Tollywood Block Bluster ...

అలా మీడియా కూడా ఎన్నోసార్లు ఎన్టీఆర్ ని అన్నా అని సంబోధించడంతో ఆ పేరు అలా చిర స్థాయిగా నిలిచిపోయింది. అయితే ఎన్టీఆర్ మాత్రం ఎక్కువగా బ్రదర్ అని అందరిని పిలిచేవారు. ఇక సినిమాల విషయంలో షూటింగ్ కి వెళ్ళేటప్పుడు.. తన వల్ల ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని సిద్ధాంతంతోనే వెళ్లేవారట ఎన్టీఆర్. కచ్చితంగా షూటింగ్ సమయానికి వెళ్లేవారట. ఇక అంతే కాకుండా తమ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చిన తమ కుమారులకు కూడా అదే పద్ధతిని నేర్పించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.