పల్నాడులో సీన్ రివర్స్..బాబుకే షాక్!

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కమ్మ నేతల ప్రభావం ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీలో కమ్మ నేతల ప్రభావం చాలా ఉంటుంది. జిల్లాలో 17 సీట్లు ఉంటే సగానికి సగం సీట్లలో కమ్మ నేతలే నాయకత్వం వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో కమ్మ నేతలంతా ఓటమి పాలయ్యారు. ఒక్క కమ్మ నాయకుడు కూడా గెలవలేదు. దీని వల్ల గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ నష్టం జరిగింది.

అయితే ఇప్పుడుప్పుడే పరిస్తితి మారుతుంది..వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, అమరావతి ప్రభావం, పన్నుల బాదుడు లాంటి అంశాలు వైసీపీకి మైనస్ అవుతున్నాయి..అవే టీడీపీకి కలిసొస్తున్నాయి. అలాగే టీడీపీ నేతలు కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూల వాతావరణం వచ్చింది. టీడీపీకి బలం పెరిగిందని అనడానికి తాజాగా చంద్రబాబు..పల్నాడు పర్యటన ఉదాహరణగా నిలుస్తుంది.

తాజాగా వర్షాల వల్ల పల్నాడులో రైతులు బాగా ఇబ్బంది పడ్డారు..పంట నష్టం కూడా ఎక్కువగానే జరిగింది. ఈ అంశంపై ప్రభుత్వ అధికారులు కూడా ముందుకు కదలలేదు. ఇదే క్రమంలో బాబు పల్నాడు పర్యటనకు వెళ్లారు..నష్టపోయిన రైతులని పరామర్శించారు..పంట పొలాలని పరిశీలించారు. అలాగే చిలకలూరిపేట, గురజాల, నరసారావుపేట స్థానాల్లో రోడ్ షోలు నిర్వహించారు. అయితే బాబుకు కూడా షాక్ తినేలా పల్నాడులో జరిగిన రోడ్ షోలకు భారీగా జనసందోహం హాజరైంది.

ముఖ్యంగా చిలకలూరిపేట, గురజాల నియోజకవర్గాల్లో ఊహించని రీతిలో ప్రజలు, బాబు రోడ్ షోకు హాజరయ్యారు. నరసారావుపేటలో కూడా భారీగానే వచ్చారు. ఈ స్థాయిలో జనం వస్తారని టీడీపీ వర్గాలు ఊహించి ఉండవు. దీని బట్టి చూస్తే పల్నాడులో ప్రజల అభిప్రాయం మారుతుందని అర్ధమవుతుందని చెప్పొచ్చు. ఇక టీడీపీ నేతలు ఇదే ఊపు కొనసాగిస్తే నెక్స్ట్ ఎన్నికల్లో పల్నాడు స్థానాల్లో సత్తా చాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి.