“స్వాతిముత్యం” పబ్లిక్ టాక్: సినిమా హిట్..హీరో ఫట్..!!

నిజంగా ఈరోజు దసరా పండుగ ఒక ఆనందం అయితే ..సినీ జనాలకు మరో పండగ లాంటిది. ఎందుకంటే ఏకంగా ఈరోజు బాక్సాఫీస్ వద్ద మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి సినీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి .వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్ ” సినిమా ఒకటైతే ..రెండోది అక్కినేని నాగార్జున హీరోగా నటించిన “ది ఘోస్ట్”.. మూడోది బెల్లంకొండ వారసుడుగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయిన గణేష్ బాబు మొదటి సినిమా “స్వాతిముత్యం “. అఫ్ కోర్స్ మెగాస్టార్ చిరంజీవి ,నాగార్జున తో కంపేర్ చేస్తే గణేష్ బాబు చాలా తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఉన్నారు . ఈ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాడు. కానీ వేసిన మొదటి అడుగే ఇద్దరు బడా హీరోలతో కాంపిటీట్ అవుతూ సినిమా రిలీజ్ చేయడం నిజంగా డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి . మరి చూద్దాం బెల్లంకొండ హీరో ఈ సినిమా ద్వారా ఎలాంటి హిట్ అందుకున్నాడో..?


బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా వర్షా బల్లమ్మ హీరోయిన్గా నటించిన సినిమా “స్వాతిముత్యం”. లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగ వంశీ సూర్యదేవా నిర్మించారు . వెన్నెల కిషోర్, ప్రగతి, సురేఖవాణి, వీకే నరేష్, సుబ్బరాజు, గోపరాజు రమణ, దివ్య శ్రీపాద, శివన్నారాయణ, హర్షవర్ధన్ తదితరులు లాంటి నటులు ప్రముఖ పాత్రలో నటించి అలరించారు. అయితే భారీ తారాగానంతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా కథ విషయానికొస్తే ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసి నవ్వుకునే స్టోరీ .

పిఠాపురం పట్టణానికి చెందిన బాలమురళీకృష్ణ గా ఈ సినిమాలో మనకి బెల్లంకొండ గణేష్ బాబు కనిపిస్తారు. ఈయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఫ్యామిలీ మూఢనమ్మకాలు, చాదస్తం కారణంగా అతనికి పెళ్లి అవ్వదు. ఈ క్రమంలోనే పెళ్లి చూపులకు వెళ్లిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయే భాగ్యలక్ష్మి హీరోయిన్ వర్ష. పెళ్లిచూపుల్లో సీన్స్ ఫన్నీగా క్రియేట్ చేశారు డైరెక్టర్. అంతేకాదు ప్రతి అబ్బాయి అమ్మాయి పెళ్లి చూపుల్లో ఎలా ఫీలవుతారు.. పేరెంట్స్ పక్కన ఉంటే ఎలా ఇబ్బందిగా ఉంటుంది అనే విషయాన్ని చక్కగా చూపించాడు . ఎలాగోలా వీళ్ళ ఈ పెళ్లి..పెళ్లి పీఠల వరకు వస్తుంది. కానీ పెళ్లికి కొద్ది గంటల ముందు షాకింగ్ ట్వీస్ట్ ఉంటుంది. దివ్యశ్రీపద తొమ్మిది నెలల బేబీని తీసుకొచ్చి నా బిడ్డకు నువ్వే తండ్రి అంటూ బిగ్ బాంబ్ పేలుస్తుంది. ఇదే సినిమా మొత్తానికి హైలెట్ సీన్.

అయితే బాలమురళీకృష్ణ కు దివ్యశ్రీ పదకు సంబంధం ఏంటి..? పెళ్లి పై వర్షబొల్లమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అసలు ఎవరు బాలమురళీకృష్ణ పెళ్లి ఆపడానికి ట్రై చేశారు..? నిజంగానే బాలమురళీకృష్ణ తప్పు చేశాడా ..?తన అల్లుడికి పెళ్ళికి ముందే బిడ్డ ఉందని తెలిసినా సురేఖ వాణి ,నరేష్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు..? ఇలాంటి షాకింగ్ ట్వీస్ట్లతో సినిమాను ఫుల్ ఎంటర్ టైనింగ్ విధంగా తెరకెక్కించాడు. నిజానికి కథపరంగా చాలా రొటీన్ స్టోరీనే అయితే తనదైన స్టైల్ లో మసాలాలు దట్టించి అక్కడక్కడ డబుల్ మీనింగ్ పంచెస్ యాడ్ చేసి డైరెక్టర్ కామిడీని పండించాడు .అయితే సినిమా పరంగా కధపరంగా ఓకే అయిన జనాలు ..హీరో నటనపరంగా పెద్దగా సాటిస్ఫై అవ్వలేకపోయారు . హీరో కన్నా హీరోయిన్ నే సినిమాకి హైలైట్ గా నిలిచింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ బెల్లంకొండ హీరోకి ఈ సినిమా భారీ సక్సెస్ ఇస్తుందని ప్రమోషన్స్ లో రేంజ్ లో పొగడేసారు ..సీన్ కట్ చేస్తే ఫస్ట్ బొమ్మ పడ్డాక బెల్లంకొండ హీరోకి అంత సీన్ లేదని తెలిసిపోయింది . దీంతో కధ పరంగా సినిమా హిట్ అయినా నటనపరంగా హీరో ఫ్లాప్ అయ్యాడు అన్న రివ్యూస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి చూడాలి బెల్లంకొండ హీరో మొదటి సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?