సన్నిహితుడుకు జగన్ షాక్..తేడా కొడుతుందా..!

తనకు అండగా ఉండేవారికి..జగన్ ఎప్పుడు అండగా ఉంటారనే చెప్పాలి. ముఖ్యంగా జగన్ కొత్తగా పార్టీ పెట్టిన సమయంలో..పైగా ఆయనకు అండగా పలువురు నేతలు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఆయన జైలుకు వెళ్ళినా సరే..ఆయనతోనే ఉన్నారు. అలాగే పదవి పోగొట్టుకుని..2012 ఉపఎన్నికల్లో సత్తా చాటారు. అయితే అప్పుడు జగన్ కోసం ఎమ్మెల్యే పదవులు త్యాగం చేసిన వారికి జగన్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేసుకుంటూ వస్తున్నారు.

పలువురుకు మంత్రి పదవులు ఇచ్చారు..అలాగే కీలకమైన పదవులు కూడా ఇచ్చారు. ఇదే క్రమంలో వైఎస్ ఫ్యామిలీ విధేయుడు, సన్నిహితుడు గడికోట శ్రీకాంత్ రెడ్డికి జగన్ చీఫ్ విప్ పదవి ఇచ్చారు. రాయచోటి నుంచి వరుసగా సత్తా చాటుతున్న శ్రీకాంత్..2012లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. అప్పుడు జరిగిన ఉపఎన్నికల్లో సత్తా చాటారు. అలాగే 2014లో కూడా శ్రీకాంత్ విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో మరోసారి సత్తా చాటారు. పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో శ్రీకాంత్‌కు మంత్రి పదవి గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల్లో భాగంగా శ్రీకాంత్‌కు మంత్రి పదవి దక్కలేదు. దానికి తగ్గట్టుగా చీఫ్ విప్ పదవి దక్కింది. అయితే రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగాకా అది కూడా పోయింది. చీప్ విప్ పదవి ముదునూరి ప్రసాద్ రాజుకు దక్కింది.

అయితే శ్రీకాంత్ రెడ్డికి కేవలం విప్ పదవి ఇస్తూ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి పదవి దక్కలేదు..ఉన్న పదవి పోయింది. చివరికి విప్ పదవి దక్కింది. ఇలా శ్రీకాంత్ హోదాని తగ్గించడం వెనుక ఏదైనా కారణం ఉందా? లేక వేరే వారికి న్యాయం చేసే క్రమంలో శ్రీకాంత్‌ని సైడ్ చేశారా? అనేది క్లారిటీ లేదు. కానీ జగన్ సన్నిహితుడుగా ఉన్న శ్రీకాంత్‌కు ప్రమోషన్ లేకపోగా, డిమోషన్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.