ఆగిపోయిన ‘ఎన్టీఆర్ 30’.. ఇదిగో ప్రూఫ్

`త్రిబుల్ ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గ్లోబల్ ప్రశంసలు అందుకుని పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ `త్రిబుల్ ఆర్` సినిమాతో జాతియ‌ స్థాయిలో వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా రేంజ్ సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. అయితే అందులో భాగంగానే ఇప్పటికే కొరటాల శివ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ తో `ఎన్టీఆర్ 30` వంటి భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.

కానీ `ఎన్టీఆర్ 30` సినిమా ఆగిపోయినట్టేనని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండటం గమనార్హం. అయితే గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన `జనతా గ్యారేజ్` సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మళ్లీ చాలా రోజుల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ఇక అలాంటి తరుణంలో కొరటాల శివ చెప్పిన కథ తారక్ కు నచ్చలేదని… కొరటాల శివకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా తన కథతో తారక్‌ను ఇంప్రెస్ చేసే విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని కామెంట్లు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అందుకు గల కారణం `ఆచార్య` డిజాస్టర్ కావడంతో కొరటాల శివను బాధలోకి నెట్టేసిందని ఇక ఆ బాధ నుంచి ఆయన బయటకు రావాలని ఎంత ప్రయత్నిస్తున్నా బయటకు రాలేకపోతున్నారని సమాచారం.

`త్రిబుల్ ఆర్` రిలీజ్ అయి ఇన్ని రోజులైనా `ఎన్టీఆర్ 30` విషయంలో ఏ అప్డేట్ రాకపోవడం కారణంగా అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక అధికారికంగా ఏ అప్డేట్ చేయకపోవడం కారణంగా ఇక ఈ సినిమా ఆగిపోయిందని..ఇదిగో ప్రూఫ్ అని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి కామెంట్స్ వస్తున్న తరుణంలో కూడా `ఎన్టీఆర్ 30` టీమ్ స్పందిస్తుందేమో వేచి చూడాలి.