రష్మికకు ఆమె చెల్లికి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. మరి అంత తేడానా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న‌.. గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈమె `ఛలో` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక రష్మిక తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తరువాత వరుస‌గా స్టార్ హీరోలు పక్కన సినిమాలు చేస్తూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును పొందింది.

గత ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ సరసన నటించిన `పుష్ప` సినిమాతో రష్మిక దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈమెకు టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఎంతో బిజీ స్టార్ గా మారిపోయింది. కెరీర్ పరంగా స్టార్ స్టేటస్ సంపాదించుకొని ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రష్మిక తరచూ తన ఫ్యామిలీ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.

అయితే ఈ ముద్దుగుమ్మ కి ఒక చిట్టి చెల్లి ఉందనే విషయాన్ని ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. తాజాగా తన ఫ్యామిలీ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి స్థానం సంపాదించుకున్న రష్మికకు కేవలం 9 సంవత్సరాల వయసుగల బుల్లి చెల్లి ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. రష్మికకు తన చెల్లికి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది.

రష్మిక 1996 ఏప్రిల్ 5వ తేదీన జన్మించింది. ప్రస్తుతం రష్మిక కి 26 సంవత్సరాలు‌. ఇకపోతే రష్మిక చెల్లి పేరు శిమ్నా మందన్న. ఈమె 2013 మార్చి 2వ తేదీన జన్మించింది. ఈమె వయసు 9 సంవత్సరాలు. అయితే వీరిద్దరికీ 17 సంవత్సరాల వయసు తేడా ఉండడంతో పాటు ఈ విషయం ఎంతోమందిని ఆశ్చర్యపడేలా చేస్తుంది. రష్మిక కు ఇంత చిన్నచెల్లా అని అందరూ వారి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.